ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్‌లోని క్లాసుల్లో కొందరు ఆణిముత్యాలు ఉంటారు. ఆణిముత్యాలు అంటే మరీ పాత వెర్షన్ అయిపోతుందేమో.. ఇలాంటి వారిని మన లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం జాతిరత్నాలు అనాలి. వీళ్ల గొప్పతనం ఏంటి అంటే.. పరీక్షా పేపర్‌లో ప్రశ్నలకు సమాధానం తెలీనప్పుడు.. అలా వదిలెయ్యరు. తమకు వచ్చింది, నచ్చింది, తోచింది రాసి.. పేపర్స్ నింపేస్తారు. ఇన్విజిలేటర్… షీట్‌కు ఒక మార్క్ వేసినా పాస్ అవుతామని.. కొందరు అడిషినల్ షీట్స్ తీసుకుని మరీ తమ పైత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ రాసే సోది విషయంలో కూడా ఒక్కొక్కరికీ ఒక్కో స్మార్ట్‌నెస్ ఉంటుంది. కొందరు మూవీ కథలు రాస్తారు. మరికొందరు తమకు తెలిసిన వంటకం గురించి వివరిస్తారు. ఇక ఏ గ్రేడ్ ఆణిముత్యాలు అయితే.. బట్టలు ఎలా ఉతకాలి.. ఉప్మా ఎలా చెయ్యాలి.. చేపలు ఎలా పట్టాలి వంటివి రాసుకొస్తారు.
మీ స్కూల్లో, కాలేజీల్లో ఇలాంటి ఫన్నీ ఆన్సర్స్ రాసిన మీరూ లేదా మీ ఫ్రెండ్స్ టీచర్‌కు దొరికిపోయిన సందర్భాలు ఉంటాయి. ఆ ఘటనలు గుర్తుకువస్తే ఇప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. పాఠశాల రోజులు గుర్తుకు వచ్చి ఒకింత ఉద్వేగానికి కూడా లోనవుతారు. తాజాగా ఓ ఇస్మార్ట్ స్టూడెంట్ లెక్కల్లో అడిగిన ఓ ప్రశ్నకు.. టీచర్ బుర్ర హీటెక్కే సమాధానం ఇచ్చాడు. తనకు తిక్క ఏ రేంజ్‌లో ఉందో చూపించాడు. (a+b)^n ఈక్వెషన్‌ను విస్తరించమని అడిగితే.. ఆన్సర్ షీట్‌పై… స్పేస్ పెంచుతూ అదే ఈక్వెషన్‌ను రాసుకుంటూ వెళ్లాడు. బాబు పైత్యానికి స్టన్ అయిన టీచర్.. 10 మార్కుల ప్రశ్నకు సున్నా మార్కుల వేసింది. ఈ జాతిరత్నం రాసిన ఆన్సర్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ‘వీడే అసలైన జాతిరత్నం’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇది చూసిన నెటిజన్స్.