పనికిరావని పక్కన పడేసిన వస్తువులను కొందరు తిరిగి వినియోగంలోకి తీసుకొస్తుంటారు. మరికొందరు పాత వస్తువులను వేరే పనులకు వాడుతుంటారు. అది కూడా అంతా ఆశ్చర్యపోయేలా వినియోగిస్తుంటారు..
ఆటోలను కార్ల రూపంలోకి మార్చడం, బైకులను ఆటో తరహాలో మార్చడం, సైకిల్‌ను బైకు రూపంలోకి మార్చడం వంటి వీడియోలను చాలా చూశాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పక్కన పడేసిన సైకిల్ చక్రాన్ని వినూత్నంగా వాడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ”ఇది కదా వాడకం అంటే”.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఇంట్లో పక్కన పడేసిన సైకిల్ చక్రాన్ని (Old bicycle wheel) వినియోగంలోకి తేవాలని అనుకున్నాడు. డైనింగ్ టేబుల్ (Dining table) లేని లోటును సైకిల్ చక్రంతో పూడ్చాలని అనుకున్నాడు. ఇందుకోసం ఓ కర్రను నిలువుగా పాతాడు. దానిపై సైకిల్ చక్రాన్ని పెట్టి గుండ్రంగా తిరిగే విధంగా ఏర్పాట్లు చేశాడు.
ఫైనల్‌గా దానిపై ఆహారంతో కూడిన ప్లేట్లను ఉంచాడు. అలా చక్రాన్ని తిప్పుతూ తనకు కావాల్సిన ఫుడ్ తింటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ”ఇది కదా వాడకం అంటే”.. అంటూ కొందరు, ”ఎలా వస్తాయబ్బా.. ఇలాంటి ఐడియాలు”.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.