Viral Video: చిరుతపులితో జర్నలిస్టు ఫైట్.. వీడియో వైరల్

www.mannamweb.com


Viral Video: సాధారణంగా పిల్లి ఎదురైతే నే అపశకునం అని భావిస్తాం.. కాసేపు మన ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటాం. అలాంటిది అతడికి ఒక పులి ఎదురయింది. ఎదురుకావడమే కాదు అతని కాలును తన నోటితో కరిచి పట్టుకుంది.
అదే అతడు చిరుతకు తలవంచకుండా.. ధైర్యంగా పోరాడాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది.

రాజస్థాన్ రాష్ట్రంలోని దుంగార్ పూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి సమీపంలోని భదర్ మెట్వాలా అనే గ్రామంలో ఓ జంతువును చిరుత పులి వేటాడింది. దానిని చంపి తినేసింది. ఈ విషయం తెలుసుకున్న ఓ విలేఖరి ఆ వార్తను కవర్ ఈ విషయం తెలుసుకున్న ఓ విలేఖరి సంఘటన స్థలానికి వెళ్ళాడు. అక్కడ చిరుత పులి చంపిన జంతువును ఫోటో తీసుకున్నాడు. అక్కడి ప్రజల ద్వారా వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం అతడు తిరుగు ప్రయాణం అవుతుండగా ఆకస్మాత్తుగా చిరుత పులి వచ్చింది అతనిపై దాడి చేసింది. అతడు ప్రతిఘటించినప్పటికీ కాలిని నోటితో అదిమి పట్టుకుంది. తన పంజా దెబ్బతో అతడిని చంపాలనుకుంది. అయితే అతడు చిరుతపులిని తీవ్రంగా ప్రతిఘటించాడు. పులికి అవకాశం ఇవ్వకుండా.. అది తన కాలిని నోట కరుచుకున్నా.. అతడు భయపడలేదు. పైగా కేకలు వేస్తూ దానిని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో గ్రామస్తులు వచ్చి తాళ్లతో ఆ పులిని కట్టేశారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. వారు దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అనంతరం ప్రత్యేక వాహనంలో చిరుతపులిని జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు.

ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “అతడు చిరుతపులిని పట్టుకున్న విధానం చూస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసింది. పులిని అలా పట్టుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఆ పులి అతడి కాలును నోట కరుచుకున్నప్పటికీ ఏ మాత్రం భయపడలేదు. దానిని ధైర్యంగా ప్రతిఘటించాడు. పంజా దెబ్బ బారిన పడకుండా తనను తాను కాపాడుకున్నాడు. ఆ విలేఖరి సాహసానికి మెచ్చుకోవాల్సిందే” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.