Vitamin-D Deficiency in Women : పట్టణ ప్రాంత మహిళల్లో ఆర్థోపెడిక్ సమస్యలకు విటమిన్ ‘డి’ లోపమే కారణం!

www.mannamweb.com


Vitamin-D Deficiency in Women : పట్టణాలు, సిటీల్లో ఉండే 80శాతం మహిళలు, చిన్నారుల్లో విటమిన్-డి లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే పబ్లిక్‌ను అలర్ట్ చేస్తున్నారు డాక్టర్లు. ఆరోగ్యం విషయంలో జాగ్రతలు అవసరమని సూచిస్తున్నారు.

Vitamin-D Deficiency in Women : మహిళలూ జాగ్రత్త. విటమిన్-డి తక్కువగా ఉందంటే లైట్ తీసుకోవద్దు. ట్యాబ్లెట్స్ వాడితే డి విటమిన్ వస్తుందనే ధీమా అస్సలే వద్దు. కచ్చితంగా రోజుకు 20నిమిషాలు ఎండలో ఉండాల్సిందే. లేకపోతే కావాలని రోగాలు తెచ్చుకున్నట్లే. హౌస్ వైప్స్‌కు అయితే మరీ మరీ అలర్ట్ చేస్తున్నారు డాక్టర్లు.

ఇంతలా ఆరోగ్య నిపుణులు అలర్ట్ చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. పట్టణాలు, సిటీల్లో ఉండే 80శాతం మహిళలు, చిన్నారుల్లో విటమిన్-డి లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే పబ్లిక్‌ను అలర్ట్ చేస్తున్నారు డాక్టర్లు. కోరి మరీ రోగాలు తెచ్చుకునే బదులు..ఆరోగ్యం విషయంలో జాగ్రతలు అవసరమని సూచిస్తున్నారు.
80శాతం మంది మహిళల్లో విటమిన్ డి లోపం :
లేటెస్ట్‌గా వచ్చిన రెండు, మూడు నిపుణుల అధ్యయనాల్లో 80 శాతం మంది మహిళల్లో విటమిన్-డి లోపం ఉన్నట్టు తేలింది. ఇంటికే పరిమితం అయ్యే మహిళలకు 30 మిల్లీ గ్రాముల కంటే తక్కువ పరిమాణంలో విటమిన్-డి అందుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు, సిటీలలో జీవించే 80 శాతం మంది మహిళల్లో విటమిన్-డి లోపాన్ని గుర్తించారు. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో..దాదాపు 50కోట్ల మందికి విటమిన్-డి లోపం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. ఇందులో 30శాతం మంది అంటే 15 కోట్లమంది చిన్నారులు, యువతనే ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి.

విటమిన్ డి లోపంతో కనిపించే లక్షణాలివే :
ఎండ ద్వారా వచ్చే సూర్యరశ్మి మనపై 40 శాతం పడినా శరీరానికి కావాల్సినంత విటమిన్-డి జనరేట్ అవుతుంది అని అంటున్నారు నిపుణులు. 18ఏళ్లు నిండినవారికి రోజుకు 2000 ఐయూ విటమిన్-డి అవసరమని చెబుతున్నారు. కానీ చాలామంది నిర్లక్ష్యం చేసి విటమిన్-డి డెఫీషియన్సీతో బాధపడుతున్నారని అంటున్నారు. విటమిన్-డి లోపంతో అలసట, ఎముకలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు మహిళలు. ఇమ్యూనిటీ పడిపోవడం, టెన్షన్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

మహిళలు, ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఉండేవారు ప్రతి రోజూ మస్ట్ గా ఉదయం సమయంలో కనీసం 30 నిమిషాల పాటు సూర్యరశ్మి తమ శరీరంపై పడేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే ఏజ్ పెరిగినా కొద్దీ ఎముకలు బలహీనపడటం, ఒళ్ళు నొప్పులు రావడం ఎక్కువ అవుతాయని అంటున్నారు. విటమిన్-డి లోపం ఉన్నవారు మెడిసిన్ వాడుతుంటారు. అయితే డాక్టర్ల సలహా లేకుండా విటమిన్-డి ట్యాబ్లెట్లు వాడొద్దంటున్నారు నిపుణులు. ఎంత ట్యాబ్లెట్లు వాడినా..అల్టర్నేట్‌గా ఏం చర్యలు తీసుకున్న.. సూర్యరశ్మి నుంచి డైరెక్ట్ గా వచ్చేదాని కంటే మెడిసిన్ ద్వారా వచ్చే విటమిన్ వల్ల ఉపయోగం పెద్దగా ఉండదని అంటున్నారు.

ఎండలో ఉండటం కుదరకపోతే..న్యూట్రీషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల..లాంగ్‌ టర్మ్‌తో విటమిన్-డి లోపాన్ని సరిచేసుకోవచ్చని అంటున్నారు. ఫ్యాటీ ఫిష్, ఫిష్ లివర్ ఆయిల్, గుడ్డు సొన, తరచుగా పుట్టగొడుగుల ఆహారాన్ని తీసుకుంటూ.. వీలైనప్పుడు శరీరంపై ఎండ పడేలా జాగ్రత్తలు తీసుకుంటే విటమిన్-డి లోపాన్ని క్రమంగా తగ్గించుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు.