చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వివో (Vivo) ‘Y’ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వై19 ఈ (Vivo Y19e) పేరిట, ఆకర్షణీయమైన లుక్‌తో విడుదల చేసింది. డ్యూయల్ కెమెరాతో బడ్జెట్ ధరలో దీన్ని తీసుకురావడం విశేషం. 4జీబీ +64జీబీ వేరియంట్ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది. గ్రీన్, సిల్వర్ రంగుల్లో ఈ మొబైల్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్‌తో పాటు ఇతర రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్14తో వై19ఈ మొబైల్‌ని వివో లాంచ్ చేసింది. ఆక్టాకోర్ యూనిసోక్ T7225 ప్రాసెసర్‌తో దీన్ని తీసుకొచ్చారు. 6.74 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. ఇక ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఇందులో 13 ఎంపీ ప్రధాన కెమెరా, 0.08 ఎంపీ కెమెరా ఇచ్చారు. సెల్పీ కోసం ముందు వైపు 5 ఎంపీ కెమెరా అమర్చారు. ఏఐ ఎరేజ్, ఏఐ ఫొటో ఎన్‌హాన్స్ వంటి ఏఐ ఫీచర్లకు ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. 5,500mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో దీన్ని తీసుకొచ్చారు. సింగిల్ ఛార్జింగ్‌తో 19 గంటల పాటు యూట్యూబ్ వీడియో ప్లే బ్యాక్ టైమ్ వస్తుందని కంపెనీ తెలిపింది.