Vivo T4 5G: మొబైల్ ప్రియులకు శుభవార్త, Vivo నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్!

Vivo T4 5G New Smartphone:


ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతిరోజూ కొత్త కొత్త స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ రంగంలో వివో కంపెనీకి మంచి పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి.

వివో నుంచి వచ్చే ప్రతి ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు వారి కొత్త మోడల్ Vivo T4 5G ఏప్రిల్ 22న భారతదేశంలో లాంచ్ అవుతోంది.

ఈ స్మార్ట్ఫోన్ Snapdragon 7s Gen 3 ప్రాసెసర్తో పనిచేస్తుందని ఎదురుచూస్తున్నారు. ఇది 6.67-అంగుళాల FHD+ క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్ప్లేని కలిగి ఉండవచ్చు. ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాతో రావచ్చు. 7,300mAh బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. భారతదేశంలో Vivo T4 5G ధర సుమారు ₹25,000 (INR)గా ఉంటుందని అంచనా.