Vizag Capital: ఏపీలో మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టో 2024ను విడుదల చేసిన ఆయన..
మూడు రాజధానులపై స్పష్టత ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖపట్నం రాజధానినిగా పరిపాలన సాగుతుందన్నారు. అంతేకాదు, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా.. విశాఖను అభివృద్ధి చేస్తాం అన్నారు. అమరావతిని శాసనరాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఇక, రెండు పేజీలతో కూడిన వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు సీఎం జగన్.. 9 ముఖ్యమైన హామీలతో కూడిన మేనిఫెస్టో చదివి వినిపించారు వైసీపీ అధినేత.
ఇక, వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టో విషయానికి వస్తే.. రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500 దాకా పెంచుతామని హామీ ఇచ్చారు సీఎం జగన్.. (2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంచుతాం).. 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తప్ప మరొకటి లేదన్నారు.. అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్ చేయూత తదితర పథకాల కొనసాగుతాయని స్పష్టం చేశారు.. వైఎస్సార్ చేయూత పథకం 4 విడతల్లో రూ.75 వేల నుంచి ఎనిమిది విడతల్లో రూ. లక్షా 50 వేలకు పెంచుతాం.. అమ్మ ఒడి రెండు వేలకు పెంచుతాం. రూ. 17వేలు చేస్తాం. తల్లుల చేతికి రూ.15 వేలు అందిస్తాం.. వైఎస్సార్ కాపు నేస్తం పథకం కొనసాగిస్తాం.. నాలుగు దఫాల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంచుతాం.. నాలుగు దఫాల్లో ఈబీసీ నేస్తం 45 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంచనున్నట్టు వెల్లడించారు. వైస్సార్ రైతు భరోసా రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు. మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందజేస్తామన్న సీఎం.. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణాలు ఇవ్వనున్నట్టు హామీ ఇచ్చారు.
ఇక, ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ. ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే ఐదేళ్లలో రూ.50 వేలు పెంచుతాం.. వాహన మిత్రను ఐదేళ్లలో రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచుతాం అన్నారు సీఎం జగన్.. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా.. చేనేతలకు ఏడాదికి రూ.24 చొప్పున, ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగిస్తాం అన్నారు. లా నేస్తం కొనసాగింపు, అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాలు కొనసాగుతాయని వెల్లడించారు సీఎం వైఎస్ జగన్.