వైజాగ్ కాలనీ సాఫ్ట్వార్ ఉద్యోగుల వీకెండ్ టూర్ కోసం చక్కటి ప్రదేశం. ఇది సీక్రెట్ ఐలాండ్ అడ్వెంచర్, బ్యాక్‌వాటర్, గ్రామీణ జీవనం వంటి అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది.
స్థానిక సంస్కృతిని ఆస్వాదించవచ్చు. ఇక్కడ హాయిగా ఒక బోట్ రైడ్ కూడా చేయవచ్చు సహస యాత్రను ఇష్టపడేవారికి విజాగ్ కాలనీ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇది తెలంగాణలోని నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఉంది. ఇది హైదరాబాద్ నుంచి దాదాపు 170 కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్ డ్యామ్ బ్యాక్‌వాటర్స్‌లో ఉన్న చిన్న గ్రామం. ఇక్కడికి వెళ్ళడానికి జస్ట్ 3 గంటలు జర్నీ చేస్తే చాలు వీకెండ్లో హ్యాపీగా గడిపి రావచ్చు.
ఆరు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి డ్యామ్ నిర్మాణం వచ్చిన 24 కుటుంబాలు ఇక్కడ స్థిరపడ్డాయి. ఇప్పుడు ఇక్కడ దాదాపు 700 మంది నివాసితులు ఉంటున్నారు. ఈ గ్రామం చుట్టూ ఉన్న ఆకుపచ్చని కొండలు, పొలాలతో ప్రశాంతంగా, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ యెల్లేశ్వరగట్టు ఐలాండ్‌కు బోట్ రైడ్ చాల ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ చిన్న ద్వీప గ్రామం ప్రకృతు దృశ్యాలు, స్థానిక సంస్కృతితో ఆకట్టుకుంటున్న దీనిని తెలంగాణలో మినీ గోవా అని కూడా పిలుస్తారు.
20 నిమిషాల బోట్ రైడ్ చేస్తే.. ఇక్కడ దగ్గర్ల ఉన్న గ్రీన్ ఐలాండ్‌కు చేరుకోవచ్చు. రైడ్ కోసం ఒక్కో వ్యక్తికి రూ.200 తీసుకుంటారు. ఈ రైడ్ బ్యాక్‌వాటర్స్ మధ్యలో నుంచి వెళ్తూ ఆహ్లదకరంగా ఉంటుంది. మీకు సాహసం చెయ్యడం ఇష్టం ఉంటే స్థానిక చేపల వేటగాళ్లతో రూ.1500కి ఓవర్‌నైట్ క్యాంపింగ్ కూడా చేయవచ్చు. నీటి మధ్యలో నక్షత్రాల రాత్రిలో రొమాంటిక్‌గా గడపవచ్చు.
సాయంత్రం సూర్యాస్తమయం నీటిపై పడి బంగారు రంగుల ఆకట్టుకుంటుంది. ఈ సమయంలో ఒక కప్పు చాయ్ తాగుతూ దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. స్థానికంగా వండిన చేపల వంటకాలను రుచి చాలా బాగుంటుంది. ఫోటోగ్రఫీ ప్రియులకు బెస్ట్ స్పాట్ అనే చెప్పవచ్చు. రస్టిక్ బోట్లు, గ్రీనరీ దృశ్యాలు, వివిధ రకాల పక్షులను మీ కెమెరాలో బందించవచ్చు.
వైజాగ్ కాలనీకి చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి NH 65 మీదుగా నార్కెట్‌పల్లి ద్వారా చందంపేట మండలం వరకు వెళ్ళండి. అక్కడి నుంచి బ్యాక్‌వాటర్స్ ప్రాంతానికి చేరుకోవడం కుంచెం కష్టం. కాబట్టి నావిగేషన్ యాప్‌ను ఉపయోగించడంతోపాటు స్థానికులను దారి అడగడం మంచిది. మీరు సొంత వాహనంలో వెళితే, రోడ్ ట్రిప్ చాలా ఖుషిగా ఉంది.




































