ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రం విశాఖపట్నం(Vizag)లోని స్టీల్ ప్లాంట్(Steel plant) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 250 అప్రెంటిస్(Apprentice) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.vizagsteel.com/ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 09 జనవరి 2025.
పోస్టులు, ఖాళీలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ – 200
టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనీ – 50
విద్యార్హత:
పోస్టును అనుసరించి 2022/ 2023/ 2024 సంవత్సరాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, బీటెక్/ బీఈ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
డిప్లొమా, బీటెక్/ బీఈలో సాధించిన మార్క్స్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
ట్రైనింగ్ పీరియడ్:
ఎంపికైన అభ్యర్థులకు వన్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది.
పే స్కేల్:
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లకు నెలకు రూ. 9,000, డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ. 8,000 వరకు జీతం ఉంటుంది.