దేశంలోని ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఇల్లు కొనాలంటే ఒక కల. ఈ కల అనేది కేవలం డబ్బున్న బడా బాబులకే సాధ్యం అవుతుంది.
ఎందుకంటే కోట్ల రూపాయలు ఉంటుంది రేటు. ఇప్పుడు ఈ నగరాల్లో ఇల్లు కొనాలనుకునే వారికి గొప్ప వరంగా హోం లోన్ మారింది. అలాగే తప్పనిసరిగా అయింది. అయితే గతేడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ) రెపోరేటును మొత్తం 1.25 శాతం తగ్గించిన తర్వాత, దేశవ్యాప్తంగా హోం లోన్ వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయి. ఈ రెపోరేటు తగ్గింపు ప్రభావంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ హోం లోన్ ప్రారంభ వడ్డీ రేట్లను 7.10 శాతం వరకు తగ్గించాయి. ప్రస్తుతం దేశంలో అత్యల్ప వడ్డీ రేట్లతో హోం లోన్లు అందిస్తున్న బ్యాంకుల జాబితాలో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందంజలో ఉన్నాయి. అంతేకాదు, కొన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా 7.15 శాతం వంటి తక్కువ వడ్డీ రేట్లకే హోం లోన్లు అందిస్తున్నాయి. ఇప్పుడు వాటి వివరాలను చూద్దాం.
ప్రైవేటు బ్యాంకులు వెనుకంజ..
అత్యల్ప హోం లోన్ల విషయంలో ప్రైవేట్ బ్యాంకులు మాత్రం వెనుబడి ఉన్నాయని లిస్ట్ ను చూస్తేనే అర్థం అవుతుంది. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేట్లకే హోం లోన్లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీతో హోం లోన్ తీసుకోవాలనుకునే వారు ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఆఫర్లపై ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిదిగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో హోం లోన్లు 7.65 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి.
పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా మనీ సేవింగ్ టిప్స్ గురించి ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయా? మీ ప్రశ్నను ఇక్కడ సబ్మిట్ చేయండి. ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్ నుండి సమాధానాలు పొందొచ్చు. ఎంపిక చేసిన ప్రశ్నలకు సమాధానాలను మా వెబ్‌సైట్‌లో ఆర్టికల్స్ రూపంలో మరుసటి రోజు చూడొచ్చు.
HDFC బ్యాంక్: ప్రారంభ వడ్డీ రేటు – 7.90%
ICICI బ్యాంక్: ప్రారంభ వడ్డీ రేటు – 7.65%
Axis బ్యాంక్: ప్రారంభ వడ్డీ రేటు – 8.35%
దేశంలోనే అత్యంత తక్కువగా హోం లోన్లు అందిస్తున్న టాప్ ఐదు బ్యాంకులు ఇవే : పైసా బజార్ డాట్‌కామ్ సమాచారం ప్రకారం,
1. బ్యాంకు ఆఫ్ ఇండియా(BOI) :
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు 7.10 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేటుతో హోం లోన్లు అందిస్తోంది.
రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు హోం లోన్లకు వడ్డీ రేట్లు :7.10%-10.00%
రూ.75 లక్షలకు మించిన లోన్లకు వడ్డీ రేట్లు :7.10% – 10.25%
2. బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra) :
ఇది కూడా ప్రభుత్వరంగ బ్యాంకునే. రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు హోం లోన్లు లభించును. వడ్డీ రేట్లు :7.10 శాతం-9.90 శాతం
3. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank) :
ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ప్రభుత్వరంగానికి చెందినది. 7.10 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీరేటుతో హోం లోన్లు అందిస్తోంది.
4. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) :
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చౌక హోం లోన్లలో ముందంజలో ఉంది. రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షలకుపైగా ఉన్న హోం లోన్లకు వడ్డీ రేటు 7.10 శాతం నుంచి 9.15 శాతం
5. యూకో బ్యాంక్ (UCO Bank)
యూకో బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంకు.. రూ. 30 లక్షల నుంచి రూ.75 లక్షలకుపైగా ఉన్న హోం లోన్లకు వడ్డీరేట్లు 7.15 శాతం నుంచి 9.25 శాతం వరకు – వడ్డీ రేట్లు: 7.15% – 9.25% తక్కువ వడ్డీతో హోం లోన్ తీసుకోవాలనుకునే వారికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉత్తమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రైవేట్ బ్యాంకులతో పోల్చితే వడ్డీ రేట్లు అనేవి మరింత తక్కువగా అందిస్తున్నాయి.



































