తేలిగ్గా బరువు తగ్గాలా? అయితే రోజూ ఓ గ్లాసుడు ఈ పండు జ్యూస్‌ తాగితే సరి

www.mannamweb.com


కర్బూజా గురించి తెలియని వారుండరు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ఇందులో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో సమృద్ధిగా ఉండే నీరు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.

ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు కర్బూజా పండులో ప్రొటీన్లు, ఫైబర్, సోడియం, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

మీరు జ్వరంతో బాధపడుతుంటే, కర్బూజా రసాన్ని తేనెలో కలిపి తాగితే శారీరక అలసట క్షణాల్లో తగ్గుతుంది. పైగా ఈ జ్యూస్‌ ఒంట్లో శక్తిని కూడా నింపుతుంది.
మలబద్ధకంతో బాధపడేవారు రోజూ కర్బూజా పండును తీసుకుంటే సమస్య నుంచి తేలిగ్గా బయటపడవచ్చు.

ఇందులోని పీచు పదార్థం మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది.
మూత్ర విసర్జన సమయంలో మంట, దురదతో బాధపడేవారికి ఈ పండు ఔషధంలా పనిచేస్తుంది.
కర్బూజా పండును తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది.
ఈ పండులో బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఎ, సిలు కంటి చూపును మెరుగుపరుస్తాయి.
అలాగే కర్బూజా జ్యూస్ తాగడం వల్ల మెదడుకు ఆక్సిజన్ బాగా అందుతుంది. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర వస్తుంది.
కర్బూజా జ్యూస్‌ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

ఇది కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఈ పండులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
కర్బూజాలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.

ఇది గుండెకు ఆరోగ్యకరమైన పోషకాలను అందిస్తుంది. ఇందులోని ఫోలేట్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అధిక బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.