14 రోజుల్లోనే మీ డయాబెటీస్ తగ్గించుకోవాలా..బెస్ట్ టిప్స్ ఇవే

యాబెటీస్‌తో బాధపడే వారు వారానికి మూడు సార్లు కాకరకాయ జ్యూస్ తాగాలంట. ఇది ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ముఖ్యంగా కాకరకాయ రసం అనేది టైప్ 2 డయాబెటీస్ మెల్లిటస్ ఉన్నవారిలోని రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను చాలా త్వరగా తగ్గిస్తుందంట.


ఈ జ్యూస్ తీసుకున్న 30 నిమిషాల తర్వాత దీని ప్రభావం కనిపిస్తుంది. అందువలన డయాబెటీస్ రోగులు తప్పనిసరిగా వారం రోజుల పాటు కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వలన వ్యాధిని నయం చేసుకోవచ్చునంట.

అలాగే ఘుగర్ వ్యాధితో బాధపడే వారు చక్కెర, బ్రెడ్, రైస్ వంటి కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదంట. డయాబెటీస్ తో బాధపడే వారు తక్కువ మోతాదులో కార్బో హైడ్రేట్స్ తీసుకోవడం వలన ఇది శరీర బరువును తగ్గించి, రక్తంలోని చక్కర స్థాయిలను కూడా తగ్గిస్తాయంట.ముఖ్యంగా తక్కువ కార్బ్ డైట్ ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలోని చక్కర స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుందంట. అందుకే చాలా వరకు కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ తక్కువ తీసుకోవాలంట.

అలాగే డయాబెటీస్‌తో బాధపడే వారు తమ రోజూ వారి ఆహారంలో దాల్చిన చెక్కను చేర్చుకోవడం చాలా మంచిదంట. ఉదయం టీలో చిటికెడు దాల్చిన చెక్కను జోడించడం ద్వారా ఇది శరీరంలోని చక్కర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందంట. అంతే కాకుండా దాల్చిన చెక్కను నార్మల్‌గా తీసుకొని కనీసం రోజుకు రెండు సార్లు నమలడం వలన కూడా ఇది ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపనున్నదంట.దీనిని రోజుకు 1 గ్రా నుండి 6 గ్రాముల వరకు తీసుకోవడం మంచిదంట.

డయాబెటిస్ తో బాధపడే వారు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి గనుక ప్రయత్నం చేస్తే, తప్పకుండా అధిక ఫైబర్ ఉండే ఆహారాలను మాత్రమే తీసుకోవాలంట. తక్కవ కార్బో హైడ్రేట్ భోజనం తర్వాత , ఫైబర్ ఎక్కువగా ఉండే సలాడ్ తీసుకోవడం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను త్వరగా తగ్గిస్తుందంట. ఎందుకంటే కూరగాయలలోని ఫైబర్, పాలీఫెనాల్స్ కార్బోహైడ్రేట్ శోషణను నెమ్మదించి, భోజనం తర్వాత చక్కెర పెరుగుదల తగ్గేలా చేస్తాయి.

ఇక డయాబెటీస్ సమస్యతో బాధపడే వారు తప్పకుండా చేయాల్సిన పనుల్లో వాకింగ్ ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు, భోజనం తర్వాత తప్పకుండా 20 నిమిషాలపాటు నడవాలంట. ఇలా ప్రతి రోజూ భోజనం తర్వాత 20 నిమిషాలు నడవడం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అమాంతం తగ్గేలా చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.