జన సమూహానికి దూరంగా ప్రకృతికీ దగ్గరగా గడపాలనుకుంటున్నారా

జనసమూహానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా కొన్ని రోజులైనా గడపాలని కోరుకునేవారు మారిషస్‌కు పయణం అవుతారు. ఈ దేశంలో ఐదు అందమైన ప్రదేశాలున్నాయి. వీటిని మారిషస్ కు దాచుకున్న ఐదు రత్నాలు అని చెబుతారు చూసిన పర్యాటకులు. ఈ దేశంలో ఆహారం నుంచి రాత్రి జీవితం వరకు ప్రతిదీ చాలా బాగుంది. ఈ దేశం సందర్శించడానికి సరైన గమ్యస్థానం. అయితే మారిషస్‌లో ప్రశాంతంగా జన సమూహానికి దూరంగా సంతోషంగా గడపడానికి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..


మారిషస్ పేరు వినగానే అందమైన బీచ్‌లు, స్పష్టమైన నీలి రంగుతో కనువిందు చేసే సముద్రాలు, పచ్చని పర్వత దృశ్యాలు మనస్సులోకి వస్తాయి. మారిషస్ ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడకు వస్తారు. ఇది సాధారణంగా హనీమూన్ డెస్టినేషన్ ప్రదేశంగా పిలువబడుతుంది. మారిషస్‌లో బీచ్‌లు మాత్రమే కాదు చాలా తక్కువ మంది పర్యాటకులకు తెలిసిన అనేక రహస్య ప్రత్యేక ప్రదేశాలు కూడా ఉన్నాయి.

రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా కొత్తగా ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళాలని.. మారిషస్ దేశంలోని నిజమైన అందాలను చూడాలనుకుంటే.. ఇక్కడ ప్రదేశాలను తప్పక సందర్శించాలి. ఈ ప్రదేశాలు శాంతి, సాహసం, ప్రకృతికి దగ్గరగా ఉండటం వంటి ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తాయి. కనుక మారిషస్‌లోని 5 అందమైన రహస్య ప్రదేశాలు ఏమిటంటే..

గ్రిస్ గ్రిస్ బీచ్
మారిషస్‌లోని ప్రసిద్ధ బీచ్‌ల రద్దీకి దూరంగా ప్రశాంతమైన ప్రదేశం కోసం చూస్తున్నట్లయితే.. గ్రిస్ గ్రిస్ బీచ్ మీకు సరైన గమ్యస్థానం. ఈ బీచ్ మారిషస్ దక్షిణ భాగంలో ఉంది. ఇక్కడి దృశ్యం స్వర్గం కంటే తక్కువ కాదు. ఈ బీచ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకే ఇక్కడ జనసంచారం తక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి సూర్యాస్తమయాన్ని చూడడం ఓ అందమైన మధురమైన జ్ఞాపకంగా నిలుస్తుంది.

రోచెస్టర్ జలపాతం
మారిషస్‌లోని పచ్చని సహజ ప్రదేశాలను అన్వేషించాలనుకుంటే.. ఖచ్చితంగా రోచెస్టర్ జలపాతాలను సందర్శించండి. ఈ జలపాతం ప్రత్యేకమైన రాళ్ళు, స్పష్టమైన నీటికి ప్రసిద్ధి చెందింది. ఇది మారిషస్‌లోని అతిపెద్ద, అత్యంత అందమైన జలపాతాలలో ఒకటి. ఇక్కడ జలపాతం కింద స్నానం చేసి ఆనందించవచ్చు. సాహస ప్రియులకు, ఫోటోగ్రాఫర్లకు కూడా ఇది సరైన గమ్యస్థానం.