కామారెడ్డిలోని పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయం(Kamareddy Paranjyothi Temple)లో అద్భుతం జరిగింది. సాక్షాత్తు అమ్మవారి కంట్లో నుంచి కన్నీరు వచ్చినట్లు భక్తులు చెబుతున్నారు.
సోమవారం ఈ వింత ఘటన చోటు చేసుకుంది. అంతేకాదు.. అప్పటివరకు కామారెడ్డిలో కురుస్తున్న వర్షం ఒక్కసారిగా నిలిచిపోయిందని, కామారెడ్డిని అమ్మవారు కాపాడారని భక్తులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని భక్తులు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం ఇలాంటి ఘటనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయంలో జరిగింది. ఆవు రూపంలో ఉన్న మహా పరమేశ్వరుడి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఎప్పుడు శివుడి మెడలో కనిపించే నాగుపాము ఆలయంలో ప్రత్యక్షం కావడంతో భక్తులు సాక్ష్యాత్తూ పరమేశ్వరుడే అంటూ మొక్కారు. ఇది జరిగిన నెలలకు కామారెడ్డిలోని అమ్మవారి కంట్లో నీరు కావడం చర్చనీయాంశం అయింది.





























