Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఇవి మానేయండి!

www.mannamweb.com


Weight Loss Tips: మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. సాధారణం కంటే ఎక్కువ బరువు పెరగడం వల్ల విపరీతమైన అలసటకు గురవుతారు.
మారుతున్న జీవనశైలీ, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది వెంటనే బరువు పెరుగుతున్నారు. శరీరంలో అధిక కొవ్వు కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. వాటి నుంచి తప్పించుకునేందుకు.. తగిన ఆహారంతో పాటు వ్యాయామం కూడా చాలా అవసరం.

బరువు తగ్గాలనుకునే వారు భోజనం చేసిన తర్వాత టీ, కాఫీలు వంటివి తాగడం మానుకోవాలి. లేదంటే మీరు మరింతగా బరువు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా లంచ్ తర్వాత మానుకోండి. లేదంటే బరువు తగ్గాలనే మీ ప్రయత్నం ఫలించదు.

టీ, కాఫీ మానుకోండి

చాలా మంది లంచ్ తర్వాత కాఫీ తాగడానికి ఇష్టపడతారు. అయితే, తిన్న వెంటనే ఆమ్ల ఆహారాలు తీసుకోవడం లేదా తినడం వల్ల కడుపులో చికాకు కలిగిస్తుంది. అలాగే కాఫీలోని చక్కెర క్యాలరీలను పెంచుతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు.

భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల..

భోజనం చేసిన తర్వాత డెజర్ట్‌లు తినడానికి అందరూ ఇష్టపడతారు. కానీ రోజూ స్వీట్లు తినే అలవాటు మంచిది కాదు. రోజూ భోజనం చేసిన తర్వాత స్వీట్లు తింటే శరీర బరువు పెరుగుతుంది. కాబట్టి, భోజనం తర్వాత స్వీట్లు తినడానికి వీలైనంత దూరంగా ఉండాలి.

ఆలస్యంగా తినకూడదు..

ఆహారాన్ని అస్వాదిస్తూ తింటే శరీరానికి ఒంటపడుతుంది. కానీ, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎక్కువగా భోజనం చేసే వారు బరువు తగ్గే అవకాశం తక్కువ. కాబట్టి సరైన సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది.