పెన్షన్ డబ్బుతో వెల్ఫేర్ సెక్రటరీ పరార్

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీలో సచివాలయం -3లో వార్డు వెల్ఫేర్ సెక్రటరీ గా పని చేస్తున్న సంపత్ లక్ష్మీప్రసాద్ పెన్షన్ డబ్బులతో పరారీ అయ్యారు.


ఈ ఘటన ఇవాళ(శనివారం) జరిగింది. 8,43,500 పెన్షన్ డబ్బులు 2,69,000 ఇతర సర్వీస్ డబ్బులు మొత్తం రూ.11 లక్షల 12,500 నగదుతో సెక్రటరీ పరారయ్యాడు. లక్ష్మీ ప్రసాద్ డ్రా చేసిన మొత్తం అమౌంట్ 38 లక్షల 14 వేల రూపాయలు గాను ఈ అమౌంట్ ఎనిమిది మందికి ఇవ్వవలసి ఉండగా ఆరుగురికి ఇచ్చి తాను వేరొకరికి ఇవ్వకుండా 11 లక్షల 12,500 రూపాయలతో పరారయ్యాడు. దాచేపల్లి మున్సిపల్ కమిషనర్ అప్పారావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు