Exit Poll 2024: నేడు తుది దశ పోలింగ్ ముగిశాక సాయంత్రం 6:30తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ కు ఎగ్జాట్ పోల్స్ మధ్య వ్యత్యాసం ఉంటుందా?
ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వం ఎంత? గత ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కు దగ్గరగా ఉన్నాయా? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా? 2019, 2014, 2009ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, అప్పటి రియల్ పోల్స్ ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం.
గత ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి
నేడు సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత నుండి అన్ని పోలింగ్ ఏజెన్సీలు, న్యూస్ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేస్తాయి. ఎన్నికల ఫలితాలను అంచనా వేసే ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి గత ఎన్నికల సమయంలో ఏం జరిగిందో పరిశీలిస్తే గత రెండు పర్యాయాలు అంటే 2014-2019 ఎన్నికలలో రెండుసార్లు ఎన్డీయే గెలుపును అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ సఫలమయ్యాయి.
విజయం ఎవరిదో చెప్పినా, సీట్ల లెక్కల్లో అంచనాలు తప్పిన ఎగ్జిట్ పోల్స్
అయితే విజయం ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఊహించడం లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ కాలేదు. 2009లో యూపీఏ గెలిచినప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దానికంటే ఎక్కువ స్థానాలను యూపీఏ గెలుచుకోవటం గమనార్హం. 2019లో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని చెప్పినప్పటికీ, సీట్ల విషయంలో మళ్లీ అంచనాలు తప్పాయి.
2019 ఎగ్జిట్ పోల్స్ కు ఎగ్జాట్ పోల్స్ కు తేడా ఇదే
2019లో 13 ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి 306 సీట్లను సాధిస్తుందని, యూపీఏ కూటమి స్థానాలను సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే ఇక్కడ కూడా ఎన్డీఏ పనితీరుపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పయి. మొత్తం 353 సీట్లు ఎన్డీఏ గెలుచుకోగా, యూపీఏకు 93 స్థానాలు వచ్చాయి. ఇక ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 2019లో 303 స్థానాలను, కూటమిలోని కాంగ్రెస్, 2019లో 52 సీట్లను గెలుచుకున్నాయి.
2014లో మోడీ వేవ్ అంచనా వేయటంలో తప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
2014లో విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు 8 ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ 283 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 105 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేశాయి. అయితే అప్పుడు మోడీ వేవ్ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి.
2014లో ఎగ్జిట్ పోల్స్ చెప్పిందిదే… కానీ ఫలితాలిలా
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఎన్డీఏ 336 స్థానాలతో విజయకేతనం ఎగురవేయగా, యూపీఏ కేవలం 60 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 2014లో ఎన్డీఏ కూటమిలోని బిజెపి 282 స్థానాలను, యూపీఏ కూటమిలోని కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్నాయి.
2009లో ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ ఎగ్జాట్ పోల్స్
2009లో ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే UPA తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, నాలుగు ఎగ్జిట్ పోల్స్ యూపీఏ విజయాన్ని తక్కువగా అంచనా వేశాయి. యూపీఏకు 195, ఎన్డీయేకు 185 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. అయితే అప్పుడు యూపీఏ 262 సీట్లు, NDA 158 సీట్లను గెలుచుకుంది. యూపీఏ కూటమిలోని కాంగ్రెస్ 206 సీట్లు , ఎన్డీఏ కూటమిలోని BJP 116 సీట్లు 2009లో గెలుచుకున్నాయి.