రోజూ బ్రెడ్ ఆమ్లెట్ తింటే ఏమవుతుంది.. ఈ విషయాలు పక్కా తెలుసుకోండి.. లైట్ తీసుకుంటే..

దేశంలో చాలా మందికి బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టంగా తింటారు. ఇది త్వరగా సులభంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా మంచి రుచితో కూడిన అద్భుతమైన అల్పాహారం. అయితే ఈ ఇష్టమైన ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహం చాలామందిలో ఉంది. ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్‌గా బ్రెడ్ ఆమ్లెట్‌ను తీసుకోవడం కామన్. అయితే దీన్ని వల్ల బరువు పెరుగుతారా..? ఆరోగ్యానికి మంచిదా..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రెడ్ ఆమ్లెట్ ఆరోగ్యకరమైనదని పోషకాహార నిపుణురాలు డాక్టర్ రోహిణి పాటిల్ తెలిపారు. అయితే అందులో వాడే బ్రెడ్ రకం, నూనె పరిమాణం చాలా ముఖ్యం. గుడ్డు అనేది ప్రోటీన్, విటమిన్లతో నిండిన ఆరోగ్యకరమైన ఆహారం. ఇది కండరాలు పెరగడానికి, మెదడుకు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది.


బ్రెడ్ రకమే కీలకం: బ్రెడ్ ఆమ్లెట్ ఎంత ఆరోగ్యకరం అనేది మీరు ఎంచుకునే బ్రెడ్‌పై ఆధారపడి ఉంటుంది. తెల్ల రొట్టె: ఇందులో ఫైబర్ ఉండదు. ఇది త్వరగా జీర్ణమై, రక్తంలో చక్కెరను పెంచుతుంది. త్వరగా ఆకలి వేస్తుంది. హోల్ వీట్ బ్రెడ్ (గోధుమ బ్రెడ్): ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. అందుకే ఇది ఉత్తమం.

బరువు నియంత్రణ: గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. హోల్ వీట్ బ్రెడ్ తో పాటు తక్కువ నూనె ఉపయోగిస్తే బరువు నియంత్రణలో ఉంటుంది.

బరువు పెరుగుదల ప్రమాదం: తెల్ల రొట్టెతో పాటు ఎక్కువ నూనె లేదా వెన్న ఉపయోగించడం వల్ల కేలరీలు పెరిగి, బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

ఆమ్లెట్‌లో ఎక్కువ కూరగాయలను కలపడం, తృణధాన్యాల బ్రెడ్‌ను ఎంచుకోవడం ద్వారా పోషక విలువలను పెంచవచ్చు. అలాగే అధిక నూనె లేదా వెన్న వాడకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీధి పక్కన లేదా క్యాంటీన్లలో కొనుగోలు చేసిన ఆమ్లెట్‌లను నివారించాలని డాక్టర్ పాటిల్ హెచ్చరిస్తున్నారు. షుగర్ లేదా గుండె జబ్బులు ఉన్నవారు మితంగా తీసుకోవడంపై వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.