మెరుగైన జీర్ణక్రియ: పడుకునే ముందు లవంగాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇది అజీర్ణం, ఉబ్బరం వంటి సాధారణ సమస్యలను తగ్గిస్తుంది.
అంతేకాకుండా లవంగాలలో ఉన్న యాంటీ మైక్రోబియల్ లక్షణాలు శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
ప్రశాంత నిద్ర: లవంగాలలో మెదడును ప్రశాంతపరిచే సహజ పదార్థాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి మంచి, గాఢమైన నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. అదేవిధంగా శరీరం నుండి విషాన్ని సులభంగా బయటకు పంపడంలో లవంగాలలో ఉండే ఔషధ గుణాలు సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు లవంగాల సేవనం కాలేయం డిటాక్సిఫై అవుతుంది.
జలుబు – దగ్గు: లవంగాలలోని వెచ్చని స్వభావం, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతు నొప్పి, దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యల నుండి వేగంగా ఉపశమనం కలిగిస్తాయి.
దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం: లవంగాలను నమిలి తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. అంతేకాకుండా ఇది పంటి నొప్పి నుండి తక్షణ ఉపశమనం అందించడానికి, ఆరోగ్యకరమైన నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తోడ్పడుతుంది.
గుండె ఆరోగ్యం: లవంగం నీరు శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. తద్వారా ఆరోగ్యకరమైన గుండె పనితీరును నిర్వహించడానికి మద్దతు ఇస్తుంది.
లవంగాల నీరు తయారీ విధానం: ఒక కప్పు నీటిలో నాలుగు నుండి ఐదు లవంగాలను వేయండి. నానబెట్టిన లవంగాలను మీడియం వేడి మీద మరో ఐదు నిమిషాలు మరగించాలి. గ్యాస్ ఆపివేసి, నీటిని చల్లబరచండి. పడుకోవడానికి దాదాపు 30 నిమిషాల ముందు ఈ లవంగాల నీటిని పరిమిత పరిమాణంలో త్రాగండి.

































