గోత్రం అంటే ఏమిటి…అసలు ఇవి ఎలా ఏర్పడ్డాయి, గోత్రం తెలియని వారు ఏమి చెయ్యాలి?

నం ఎప్పుడైనా గుడికెళ్ళి అర్చన చేయించాలన్న ఏదైనా అభిషేకం చేయించాలన్నా పంతులు మనల్ని అడిగే ప్రశ్న పేరు, గోత్రం. అసలు ఈ గోత్రం అంటే ఏంటి? అది ఎలా పుట్టింది.


అసలు హిందూ పురాణాల్లో ఈ గోత్రం ప్రస్తావన ఎప్పుడు మొదలైంది. గోత్రం తెలియని వారు ఏమి చెయ్యాలి అనే వివరాలు మీ కోసం..

గోత్రం అనే ప్రస్తావన మొదటి సారి ఎప్పుడు చాందోగ్య ఉపనిషిద్ లో సత్య కామ జబాలి అనే కథ లో వినిపిస్తుంది. తండ్రి ఎవరో తెలియని ఒక బాలుడు గౌతమ మహర్షిని విద్యను నేర్పించమని కోరగా నీ తల్లి తండ్రులు ఎవరు, గోత్రం ఏమిటి అని అడుగుతాడు. ఆ కధలో మొదటిసారి గోత్రం అనే ప్రసక్తి కనిపించింది. అసలు గోత్రం అంటే అర్థం తెలుసా? గో అంటే భూమి, గోవు, వేదం, గురుడు అనే చాలా అర్థాలే ఉన్నాయి. త్రం అంటే గొట్టం అనే అర్థం వస్తుంది. అంటే వ్యావహారిక భాషలో గోత్రం అంటే గోవుల సమూహం అని అర్థం వస్తుంది. మరి ఈ గోవుల సమూహం అనేది మనుషులకు ఎలా వచ్చింది అనేది చాలా ఆసక్తికర విషయం.

ప్రాచీన కాలంలో మనకు ఆవులే సంపద. ఎంత గో సంపద ఉంటే అంత ధనవంతుడి కింద లెక్క. ఆవులు ఎద్దులు కలిపి ఒక మందగా ఏర్పాటు చేసేవారు. వీటి సంతాన వృద్ధి ఒకే మందలో జరిగితే వాటి జాతి క్రమంగా క్షీణించే ఇబ్బంది రావొచ్చు కాబట్టి వీటిని వేరే మందలో గోవులతో కలిపేవారట. అలా ఏయే మందలో గోవు ఎదో గుర్తించడానికి ఆ మందకు ఆ కాపరి పేరు పెట్టేవారట. అలా వాటిని ఈజీ గా గుర్తించేవారు. అలా ఈ గోత్రాలు ఏర్పడ్డాయి. ఇందులో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నిగూఢమైన జెనెటిక్స్ రహస్యాలు ఉన్నాయి. వేరే మందతో కలిసిన ఆవులు ఆరోగ్యంగా పుట్టటం తో గమినించిన ఆ కాలం ఋషులు, పూర్వికులు మెల్లగా వీటిని మనుషులకు కూడా వర్తింపచేశారట. నిజానికి మీరు గమనిస్తే ఇప్పుడు డాక్టర్లు మేనరికం వివాహాలు వద్దు అని చెప్పటం అనేది కూడా ఒక విధంగా దీనికి సంబంధించినదే. అలా ఒక మనిషి పలానా గ్రూప్ కు చెందిన వాడు అని చెప్పటానికి ఆ ఆ గ్రూప్ పెద్ద పేరు మీద వారిని పిలిచేవారు. అలా భరద్వాజుడు, కశ్యపుడు వంటి ముఖ్య గోత్రపాలకులు తరువాత ఋషులు గా గుర్తింపు పొందారని వారి పేరు మీద ఏయే గోత్రాలు ఏర్పడ్డాయని మనకు ఆధారాలున్నాయి.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొత్తం భారత దేశంలో 3 కోట్ల గోత్రాలున్నాయట. అసలు మొదటగా ఈ గోత్రాలు అనేవి బ్రాహ్మణులలో ఉండేవట. తరువాత ఇందులో ప్రయోజనాలు గుర్తించి మిగతా వర్ణాల వారు కూడా వీటిని పెట్టుకోవడం స్టార్ట్ చేసారు. మనం ఏ వంశంలో పుట్టామో అదే మన గోత్రంగా చెప్తారు. అలాగే ప్రకృతి పేర్లమీద గోత్రాలు ఉంటాయి. అసలు ఈ గోత్రాలు మొదటగా సప్త ఋషుల పేర్ల మీద ప్రారంభమయ్యాయి. తరువాత భూములు కలిగినవారు భూపతి, భూపాల వంటి గోత్రాలు ఏర్పరుచుకున్నారు. అలాగే కొన్ని గోత్రాలు వ్యవసాయం లో వాడే పనిముట్ల పేరు మీద, ఉపయోగించే ఆయుధం పేరు మీద కూడా ఏర్పడ్డాయి. విద్య నేర్పిన గురువు పేరు మరి కొన్ని గోత్రాలు ఏర్పడ్డాయి.

అయితే గోత్రం తెలియని వారు ఏమి చెయ్యాలి అనే దానికి కొన్ని మార్గాలున్నాయి. కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం గోత్రం తెలియని వారు విష్ణువుని ప్రార్థించేవారైతే విష్ణు గోత్రంగా, అలాగే శివుడును ప్రార్థించేవారు శివ గోత్రం గా చెప్పుకోవచ్చు అనేది పండితులు అభిప్రాయం. అలాగే కాశ్యపస గోత్రం అని కూడా చెప్పుకోవచ్చు అని మరికొంత మంది పండితుల అభిప్రాయం. కాశ్యపుడు అనేక విషయాలకు మూవులపురుషుడు కాబట్టి అయన గోత్రాన్ని ఎవరైనా చెప్పుకోవచ్చు అని చెప్తారు. అలాగే దైవ గోత్రం అని కూడా చెప్పవచ్చు అనేది మరికొంతమంది అభిప్రాయం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.