ఉద్యోగులు ఏదైనా సంస్థలో నిరంతరం కంటిన్యూగా ఐదు సంవత్సరాల పాటు పని చేసినట్లయితే వారికి ఆ సంస్థ కల్పించే ప్రత్యేక ఆర్థిక ప్రయోజనమే గ్రాట్యూటీ, ముఖ్యంగా ఉద్యోగి రిటైర్ అయినప్పుడు లేదా అతను సంస్థ నుంచి రాజీనామా చేసినప్పుడు ఈ గ్రాట్యూటీ మొత్తాన్ని కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది.
1972 ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి. అయితే ఈ గ్రాట్యూటీ అనేది ఉద్యోగికి సంస్థ ఇచ్చే ఒక గుర్తింపుగా చూడవచ్చు. సాధారణంగా ఐదు సంవత్సరాల పాటు మధ్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కంటిన్యూగా ఐదు సంవత్సరాల పాటు పని చేసినట్లయితే, ఈ గ్రాట్యూటీ అనేది చెల్లిస్తారు. అంతేకాదు గ్రాట్యూటీ అనేది సాధారణంగా 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలు లేదా రిజిస్టర్డ్ కంపెనీలు తప్పనిసరిగా ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రాడ్యుటీని ఎలా చెల్లిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రాట్యూటీ చెల్లించేందుకు ఒక నిర్దిష్టమైన ఫార్ములా ఉంది. ఇది ఉద్యోగి చివరి జీతం అలాగే అతను పనిచేసిన సంవత్సరాలను బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు టాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. ఈ గ్రాట్యూటీ చెల్లించడానికి గరిష్టం మొత్తం రూ. 20 లక్షలుగా ఉంది.
గ్రాట్యుటీ ఫార్ములా ఇదే:
గ్రాట్యుటీ = (చివరి నెల జీతం x 15 x పనిచేసిన సంవత్సరాలు) / 26
పైన పేర్కొన్నటువంటి ఫార్ములా లో 26 అనేది పని దినాల సంఖ్య,
5 సంవత్సరాల సర్వీస్ తర్వాత రూ. 50,000 ప్రాథమిక జీతంపై మీ గ్రాట్యుటీ ఎంత ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రూ. 50,000 ప్రాథమిక జీతం, 5 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉద్యోగికి గ్రాట్యుటీని లెక్కిద్దాం.
చివరిగా తీసుకున్న జీతం x సర్వీస్ చేసిన సంవత్సరాల సంఖ్య) X 15/26 అనే సూత్రాన్ని ఉంచడం
(50,000 × 5 × 15) ÷ 26
గ్రాట్యుటీ మొత్తం = రూ. 1,44,230 లభిస్తుంది.
































