విదేశాల్లో భారతీయ విద్యార్థులు వరుసగా చనిపోతున్నారు. తాజాగా మరొకరు చనిపోయారు. ఈ ఏడాది అమెరికాలో 11వ ఘటన. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. వరుస మరణాలు అమెరికాలోని భారతీయ విద్యార్థులను, భారత్ లోని వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
విదేశాల్లో భారతీయ విద్యార్థులు వరుసగా చనిపోతున్నారు. తాజాగా మరొకరు చనిపోయారు. ఈ ఏడాది అమెరికాలో 11వ ఘటన. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. వరుస మరణాలు అమెరికాలోని భారతీయ విద్యార్థులను, భారత్ లోని వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2022-2023 సెషన్లో 2.6 లక్షల మంది భారతీయ విద్యార్థులు తమ దేశానికి వలస వచ్చారని అమెరికా తెలిపింది. అయితే ఇటీవల ఇండియన్స్ స్టూడెంట్స్ అనుమానస్పందగా చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
మాస్టర్స్ కోసం 2023లో అమెరికా వెళ్లిన హైదరాబాద్ కు చెందిన 25 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు న్యూయార్క్ భారత రాయబార కార్యాలయం తెలిపింది. మహ్మద్ అబ్దుల్ అర్ఫత్ దాదాపు మూడు వారాలుగా కనిపించకుండా పోయాడని, అబ్దుల్ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నామని, అతని ఆచూకీ కోసం స్థానిక చట్ట అమలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని రాయబార కార్యాలయం ఇంతకు ముందు తెలిపింది. ఇవాళ ఉదయం ఆయన చనిపోయినట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
‘ఓహియోలోని క్లీవ్ ల్యాండ్ లో గాలింపు చర్యలు చేపట్టిన మహ్మద్ అబ్దుల్ అర్ఫత్ శవమై కనిపించాడని తెలిసి చాలా బాధపడ్డాం. మహ్మద్ అర్ఫత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని రాయబార కార్యాలయం పేర్కొంది. మహ్మద్ అబ్దుల్ అర్ఫత్ మృతిపై సమగ్ర దర్యాప్తు కోసం IndiainNewYork స్థానిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆయన పార్థివదేహాన్ని భారత్ కు తరలించేందుకు కుటుంబ సభ్యులకు అన్ని విధాలా సహకరిస్తున్నామని తెలిపింది. అయితే డెడ్ బాడీని ఇండియాకు తరలించేందుకు 1,200 డాలర్లు చెల్లించాలని అబ్దుల్ తండ్రికి బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విదేశాల్లో భారతీయ విద్యార్థులు చనిపోతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.