యూరోపియన్ హార్ట్ జర్నల్ నుంచి ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నివేదికలో ఉదయం సమయంలో కాఫీ తాగేవారు..
రోజులో ఎప్పుడైనా కాఫీ తాగేవారితో పోలిస్తే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని పేర్కోంది.
ఈ నివేదిక మనం కాఫీ తాగాలా వద్దా అని చెప్పడం లేదు.. అలా అని కాఫీ వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏమిటో కూడా చెప్పడం లేదు. నివేదిక ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే కాఫీని ఎప్పుడు సేవించాలి అని చెప్పడమే.
ఈ అధ్యయనం ప్రకారం.. పరిమిత మోతాదులో కాఫీ తాగేవారు.. రోజువారీ జీవితంలో కాఫీ అసలు తీసుకోని వారితో పోలిస్తే ఆరోగ్యంగా ఉన్నారట.
ఈ పరిశోధన కోసం అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి దాదాపు 40,000 మంది ప్రజల డేటాను తీసుకుని.. దానిని లోతుగా విశ్లేషించారు. వారి ఆహారం నుంచి కాఫీ తాగే సమయం వరకు ఇందులో పరిశీలించారు. ఈ అధ్యయనం 1999 నుంచి 2018 మధ్య ప్రజల నుంచి సేకరించిన డేటా ఆధారంగా జరిగింది.
ఈ సర్వేలో పాల్గొన్న వారిని వారి ఆహారపు అలవాట్లతో పాటు కాఫీ తాగే ఖచ్చితమైన సమయం గురించి కూడా అడిగారు. అంతేకాకుండా వారు ఎంత మోతాదులో కాఫీ తాగారు అనే దానిని కూడా రికార్డు చేశారు.
ఈ అధ్యయనంలో ఒక కప్పు లేదా రెండు కప్పులు లేదా అంతకంటే ఎక్కువ కాఫీ తాగేవారిలో లేదా ఉదయం ఒకసారి కాఫీ తాగేవారిలో వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉందని స్పష్టంగా కనుగొన్నారు. ఉదయం కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి సానుకూల ప్రభావం కలుగుతుందని ఈ నివేదిక చెబుతోంది.


































