ఏపీ డీఎస్సీ 2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చివరి దశకు వచ్చింది. ఇప్పటికే మెరిట్ లిస్ట్ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఒక పోస్టుకు ఒకరికి కాల్లెటర్స్ పంపించనుంది.
ఇప్పటికే ఎంపికైన వారికి మెసేజ్లు అందుతున్నాయి. అలా మెసేజ్ అందుకుకున్న వారి సర్టిఫికెట్స్ను తనిఖీ చేయనున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నట్టు అయితే వారికి కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తారు. అలా ఇచ్చిన అందుకున్న వారికి కాల్లెటర్స్ పంపిస్తారు. ఎంపికైన వారికి స్కూల్ను ఎంచుకునే అవకాశం కూడా ఇస్తారు. అన్నీ కూడా ఇచ్చిన కాల్లెటర్లో స్పష్టంగా ఉంటాయి. అయితే ఇలా ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి మొదటి నెలలో జీతం ఎంత వస్తుంది. జీతం ఎప్పుడు మళ్లీ పెరుగుతుంది? అనే వివరాలను ఇక్కడ చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు అంటే చాలా మందికి మక్కువ ఎక్కువ. అందుకే ఏళ్లతరబడి ఈ పోస్టుల కోసం చదువుతూనే ఉంటారు. ఏడేళ్లుగా డీఎస్సీ వేయలేదు. అయినా అభ్యర్థులు విసుగు లేకుండా చదువుతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ వేయడంతో వేటాడే సింహాల మాదిరిగా పోటీ పడ్డారు. ఇందులో వేల మంది విజయం సాధించారు. ఇప్పుడు వారంతా ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అలా చేరిన వాళ్లు మొదటి జీతాన్ని అక్టోబర్ లేదా నవంబర్లో అందుకుంటారు.
ఉపాధ్యాయులకు జీతభత్యాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే ఈ ఉద్యోగాలకు అంత పోటీ ఉంటుంది. జీత భత్యాలతో పాటు సమాజంలో ప్రత్యేక గౌరవం గుర్తింపు ఉంటుంది. అన్నింటి కంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏపీ డీఎస్సీ ప్రకారం ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్ ఉద్యోగాలకు నియామకాలు జరిగాయి.
ఎస్జీటీ ఉపాధ్యాయుల జీతం ఎంత?
ఎస్జీటీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి బేసిక్ శాలరీ 21,230 నుంచి 63,010 వరకు ఉంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ బట్టి మారుతూ ఉంటుంది. మిగతా అలవెన్స్ ఇతర బెనిఫిట్సతో కలిసి ఎస్జీటీలో జాయిన్ అయిన ఉపాధ్యాయుడు మొదటి నెల 35 వేల వరకు డ్రా చేసే అవకాశం ఉంది. ఇదే విభాగంలో పని చేసే ఎక్స్పీరియన్స్ ఉపాధ్యాయుడు 97వేలకుపైగా జీతం అందుకుంటూ ఉంటారు.
స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల జీతం ఎంత?
స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయుడి బేసిక్ శాలరీ 29వేల వరకు ఉంటుంది. అది మిగతా అలవెన్స్లతో కలుపుకుంటే 45వేల వరకు జీతం లభిస్తుంది. ఈ విభాగంలో ఎక్స్పీరియన్స్ ఉద్యోగి అయితే లక్షా 20 వేల వరకు డ్రా చేసే అవకాశం ఉంది.
మిగతా అలవెన్స్లు అంటే ఏం ఉంటాయి?
ప్రభుత్వం ఇచ్చే జీతంతోపాటు ఉపాధ్యాయులకు డీఏ ఇస్తుంది. ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం 42 శాతం ఇస్తున్నారు. హెచ్ఆర్ఏ కూడా 12 శాతం ఇస్తున్నారు. వీటికి తోడు మెడీక్లైమ్ ప్రభుత్వం కల్పిస్తోంది. మిగతా ప్రోత్సాహకాలు ఉంటాయి.
వచ్చే బెనిఫిట్స్, భత్యాలు
వైద్య సౌకర్యాలు- ఉద్యోగికి, ఆ వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వ హాస్పిటల్స్ల ఇండివిడ్యువల్ మెడీక్లైమ్ ఫెసిలిటీ ఉంటుంది.
స్కూల్ సెలవులు- స్కూల్లో పని చేసే ఉపాధ్యాయులకు ప్రతి ఆదివారం సెలవు వస్తుంది. రెండో శని వారం సెలవు, పండగలకు సెలవులు వస్తాయి. క్యాజువల్ లీవ్స్, మెడికల్ లీవ్స్, ఎర్న్డ్ లీవ్స్, మెటర్నిటీ లేదా పెటర్నిటీ లీవ్స్ ఉంటాయి.
పెన్షన్/ రిటైర్మెంట్ బెనిఫిట్స్- ప్రస్తుతానికి ఓల్డ్ పింఛన్ స్కీమ్ అమలు కానందున రిటైర్మెంట్ తర్వాత వచ్చే లాభాలు చాలా తక్కువ, ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేస్తే మాత్రం కొత్తగా జాయిన్ అయిన వాళ్లకు కొంత ప్రయోజనం కలుగుతుంది.




































