గోధుమ నూక vs ఓట్స్‌.. వీటిల్లో ఏది తింటే వెయిట్ లాస్ అవుతారు

www.mannamweb.com


ఈ మధ్య కాలంలో అందరూ ఎదుర్కొనే సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా ఇతర దీర్ఘకాలిక సమస్యలు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

బరువు ఎక్కువగా ఉంటే.. కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటివి ఎటాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంత మంది డైటీషయన్స్‌ సలహాలు తీసుకుంటే.. మరికొంత మంది ఇంట్లో సొంతంగా బరువు తగ్గేందుకు ట్రై చేస్తున్నారు. దీంతో ఏం తింటే మంచిదో తెలీక తిక మక పడుతూ ఉంటారు. ఓట్స్ తింటే బరువు తగ్గుతారని చాలా మంచికి తెలిసిన విషయమే. కానీ గోధుమ నూక కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తిన్నా కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చని మరికొంత మంది అంటున్నారు. మరి వీటిల్లో ఏది బరువు తగ్గేందుకు ఎక్కువగా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమ నూక:

గోధుమ నూక అనేది ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. గోధుమ నూకతో చాలా మంది ఉప్మా, జావ, అన్నం లాంటివి చేసుకుంటూ ఉంటారు. పూర్వం వీటిని ఎక్కువగా తీసుకునేవారు. ఇవి తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఈ గోధుమ నూక ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎక్కువ శాతం ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి, కార్బోహైడ్రేట్లు ఇతర ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి ఈ నూకతో చేసిన పదార్థాలు తక్కువగా తీసుకున్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. త్వరగా ఇతర పదార్థాలను కూడా తీసుకోలేం. ఆకలి తక్కువగా ఉంటుంది. ఉదయం గోధుమ నూక తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. తక్షణమే శక్తి వస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ కూడా పెరగకుండా ఉంటాయి. ఇంకా చాలా లాభాలు ఉన్నాయి.

ఓట్స్:

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఓట్స్. చాలా మంది ఇప్పడు వీటిని జోరుగా ఉపయోగిస్తున్నారు. ఓట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఓట్స్‌తో ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్ ఐటెమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓట్స్‌ని పోషకాలకు పవర్ హౌస్‌గా చెప్పొచ్చు. ఇందులో కూడా ఫైబర్, ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. బరువు తగ్గడంలో, షుగర్‌ని కంట్రోల్ చేయడంలో కూడా ఓట్స్ ఎంతో చక్కగా సహయ పడతాయి.

ఏది బెటర్..

గోధుమ నూక, ఓట్స్ రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గడానికి ఈ రెండూ కూడా చక్కగా హెల్ప్ చేస్తాయి. అయితే ఓట్స్‌తో పోల్చితే గోధుమ నూకలో క్యాలరీలు అనేవి తక్కువగా ఉంటాయి. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఓట్స్ బదులు గోధుమ నూక తీసుకుంటే మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)