మనలో చాలామంది కొత్త వాహనాలు కొంటూ ఉంటాం. కొన్న సమయంలో ఆ కార్లు, బండ్లు షోరూమ్ వాళ్ళు మనకు తాళం చెవులు అందిస్తూ ఉంటారు. ఆ వాహనానికి సంబంధించిన మాస్టర్ కి తో పాటు మరొక తాళంని కూడా మనకి అందిస్తారు.మనలో చాలామంది ఒకటి బండి దగ్గర ఉంచుకొని మరొకటి లోపల దాచుకుంటూ ఉంటాం.
అయితే చాలామందికి తాళం చెవులు ఎక్కడో పెట్టి మర్చిపోయే అలవాటు ఉంటుంది…లేదా తెలియకుండా పడేయవచ్చు. అటువంటి సమయంలో మన దగ్గర ఉన్న స్పేర్ కీ వాడుకుంటూ ఉంటాం. చాలామంది దగ్గర అటువంటి స్పేర్ కి కూడా లేని సమయంలో దానికి డూప్లికేట్ కీ తయారు చేస్తూ ఉంటారు. అంటే మన బండి తాళాలను పోలిన తాళాలు తయారు చేయడం అన్నమాట. ఆ డూప్లికేట్ తాళాలు ఒరిజినల్ ఉన్నంత భద్రంగా ఉండవు. ఇలాంటి అప్పుడు మనం పోగొట్టుకున్న తాళాలను మళ్ళీ పొందే అవకాశం ఉందని మీకు తెలుసా…
మనం బండి లేదా కారు కొన్నప్పుడు మన ఒరిజినల్ తాళాలకి ఒక ట్యాగ్ వేసి ఇస్తారు. ఆ ట్యాగ్ మీద ఒక సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య మన బండి తాళానికి సంబంధించిన సంఖ్య. ఆ ట్యాగ్ ను భద్రంగా దాచుకుంటే మన తాళం పడిపోయినప్పుడు ఆ ట్యాగ్ ను పట్టుకొని షో రూమ్ వద్ద చూపిస్తే సేమ్ అలాంటి ఒరిజినల్ కీ నే మళ్ళీ మనకి తయారు చేసి ఇస్తారు. అందువలన ట్యాగ్ ఎంతో భద్రంగా దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనలో చాలామందికి ఆ ట్యాగ్ ఎందుకో తెలియక పారేస్తూ ఉంటాం. ఇకపై దాన్ని పడేయకుండా దాచుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంటుంది.