రక్తపోటు. అధికంగా ఉన్నా.. లో బీపీ వచ్చినా సమస్యలు తప్పవు. బీపీ బాధితుల సమస్య ప్రస్తుత కాలంలో బాగా పెరుగుతున్నారు. హైబీపీ కారణంగా వచ్చే ముప్పు గురించి చాలా మందికి అవగా హన ఉంది.
అయితే, లో బీపీని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. కాగా, లో బీపీ లక్షణాలు ఏంటి.. ఏ పరిస్థితుల్లో ప్రమాద కరం.. వెంటనే ఏం చేయాలనే దాని పైన వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు.
లో బీపీ ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడాన్ని సూచి స్తుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తుల్లో రక్తపోటు అనేది 120/80 mmHg ఉండాలని, 90/60 mmHg లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు దానిని లో బీపీగా భావిస్తారు. లో బీపీ కారణంగా తల తిరగడం, మూర్ఛపోవడం, అలసట, నీరసం, వికారం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం పాలిపోవడం, మూత్రపిండాల సమస్యలు, మసక దృష్టి వంటివి ఉంటాయి. ఇవి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లో బీపీ ఉన్నప్పుడు రక్తపోటును సాధారణ స్థాయికి తీసుకురావడానికి ఎండుద్రాక్షలను రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం నీటితో కలిపి తీసుకుంటే మంచిదని చెబుతారు.
బీట్‌రూట్ రసం లేదా కూరగా తీసుకున్న మంచి ఫలితం ఉంటుంది. రాత్రిపూట నానబెట్టిన బాదం పప్పులను ఉదయం మెత్తగా చేసి, పాలతో కలిపి తాగడం వల్ల బీపీ నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. లోబీపీ సమయంలో కొంచెం ఉప్పు కలిపిన నిమ్మరసం తక్షణ ఉపశమ నా న్ని ఇస్తుందని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ కూడా లో బీపీకి ఒక ప్రధాన కారణం.రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలని చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని భాగంగా తీసుకోవాలి.లో బీపీ ఉన్నప్పుడు కాఫీ, చాక్లెట్, అరటిపండు, కివి లాంటివి తీసుకోవడం కూడా మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. లో బీపీని నివారించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకో వడం తప్పనిసరి. ఒకేసారి ఎక్కువగా తినకుండా, తక్కువ మోతాదులో తరచుగా ఆహారం తీసుకో వడం వల్ల రక్తపోటులో వచ్చే అకస్మాత్తు మార్పులను నివారించవచ్చని చెబుతున్నారు. రోజు తేలి కపాటి వ్యాయామాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయని వైద్యులు చెబుతున్నారు.
































