బ్లడ్‌ షుగర్‌ టెస్ట్ ఏ సమయంలో చేసుకోవాలి.? నిపుణులు ఏమంటున్నారు..

www.mannamweb.com


ప్రస్తుతం డయాబటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే డయాబెటిస్‌ను ముందుగా గుర్తిస్తే సరైన చికిత్స, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే వీలైనంత త్వరగా ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అందుకే క్రమంతప్పకుండా బ్లడ్‌ షుగర్‌ టెస్ట్‌ను చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే బ్లడ్‌ షుగర్‌ టెస్ట్‌ ఎప్పుడు చేసుకోవాలి.? ఏ సమయంలో చేసుకుంటే సరైన ఫలితాలు వస్తాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎలాంటి ఆహారం తీసుకోక ముందు షుగర్‌ టెస్ట్‌ చేసుకోవడాన్ని ఉత్తమ సమయంగా నిపుణులు చెబుతుంటారు. ఉదయం నిద్ర మేల్కొన్న తర్వాత మొదట రక్తంలో చక్కెరను తనిఖీ చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

* అలాగే భోజనం చేసిన తర్వాత రెండు గంటల తర్వాత బ్లడ్ షుగర్‌ టెస్ట్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల సరైన ఫలితం తెలుస్తుంది.

* ఇక ఆహారం తీసుకునే ముందు షుగర్‌ టెస్ట్‌ చేసుకోవడం బెస్ట్‌ అని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్సులిన్‌ మోతాదు తీసుకోవడంలో సహాయపడుతుంది.
* * అధిక దాహం, అలసట, తరచుగా మూత్రవిసర్జన, తలనొప్పి, అస్పష్టమైన దృష్టి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే బ్లడ్‌ టెస్ట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* ఇక వ్యాయామం చేసే ముందు తర్వాత బ్లడ్ షుగర్ టెస్ట్‌ చేయించుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ని సరిగ్గా అంచనా వేయొచ్చు.

* ఇక తినడానికి ముందు రక్తంలో చక్కెర స్థాయి 80-130 mg/dL ఉండాలి అని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ పేర్కొంది. అదే సమయంలో, ఆహారం తిన్న 1-2 గంటల తర్వాత 180 mg/dL కంటే తక్కువగా ఉండాలి.