మనం తీసుకునే మాంసాహారాల్లో చికెన్ (కోడి మాంసం), మటన్ (గోట్ మాంసం) రెండిటినీ ప్రధానంగా చెప్పుకుంటారు. నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్లు చాలా మందే ఉన్నారు.
కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆదివారం వచ్చింది అంటే చాలు. నాన్ వెజ్ వంట ఉండాల్సిందే. అయితే, చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే.. చికెన్, మటన్ ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది మంచిది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రాముఖ్యంగా పరిగణించే వారు, బరువు తగ్గాలనుకునేవారు, ఫిట్‌నెస్ ఆసక్తిగలవారికి ఈ సందేహం(Chicken vs Mutton) రావడం సహజం. మరి ఈ రెండిటి మధ్య తేడాలు, పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు, ప్రమాదాలు వంటి అంశాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1. ప్రోటీన్ కంటెంట్:
చికెన్: బోన్‌లెస్ చికెన్ బ్రెస్ట్‌లో అధికంగా ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రా చికెన్ బ్రెస్ట్‌లో దాదాపు 31గ్రా ప్రోటీన్ ఉంటుంది. తక్కువ కాలొరీలు & తక్కువ కొవ్వు ఉంటుంది.
మటన్: 100 గ్రా మటన్‌లో సుమారు 25 నుంచి 27గ్రా ప్రోటీన్ ఉంటుంది. అయితే మటన్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
- కాబట్టి ప్రోటీన్ విషయంలో చికెన్ మంచి ఎంపిక.
2.కొవ్వు, కాలొరీలు:
చికెన్: ఇందులో తక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఒక బ్రెస్ట్ పీస్ లో సుమారు 165 కాలొరీలు ఉంటాయి.
మటన్: ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఇది గుండెకు హానికరం. ఒక సర్వింగ్ మటన్ లో సుమారు 250 నుంచి 300 కాలొరీలు ఉంటాయి.
- కాబట్టి తక్కువ ఫ్యాట్, తక్కువ కాలొరీల కోసం చికెన్ ఉత్తమం.
3.జీర్ణశక్తి:
చికెన్: ఇది చాలా తేలికగా జీర్ణమవుతుంది. చిన్న పిల్లలు, వృద్ధులు ఏ వయసువారైనా సులభంగా తినవచ్చు.
మటన్: ఇది చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. కిడ్నీ, లివర్ సమస్యలున్నవారికి మటన్ కు ఎంత దూరంగా ఉండే అంత మంచిది
- జీర్ణశక్తికి అనుకూలమైన విషయంలో చికెన్ మంచి ఎంపిక
పోషక విలువలు:
మటన్: ఐరన్, జింక్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
చికెన్: బలమైన ప్రోటీన్ మూలం, బరువు తగ్గే వారికి అనుకూలం.
- ప్రతి వారంలో 2 నుంచి 3 సార్లు మాత్రమే మాంసాహారం తినడం ఆరోగ్యపరంగా మంచిది.
































