తులసి చెట్టు అనేక రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ మన భారతదేశంలో రెండు రకాలు మాత్రమే అందుబాటులో ఉంది. అందులో ఒకటి కృష్ణ తులసి అయితే రెండవది రామ తులసి..
ఈ తులసి చెట్లు ఇంట్లో ఉండడం ఎంతో శుభసూచికంగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం తులసి మొక్క ఉన్నవారింట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ప్రతి భారతీయుని ఇంట్లో తప్పకుండా ఒక తులసి చెట్టు ఉంటుంది. తులసి చెట్టు తో పాటు కొంతమంది ఇళ్లలో తమలపాకు చెట్టు కూడా ఉంటుంది. అలాగే తులసి చెట్టు ఉండే ఇంటిని భారతీయ సాంప్రదాయం ప్రకారం చాలా పవిత్రమైన ఇల్లులా భావిస్తారు. అంతేకాకుండా ఇంట్లో ఏవైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయని భారతీయుల నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరు ఇంటిముందు తప్పకుండా తులసి మొక్కను నాటుతూ రోజు ఉదయం పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో రామ తులసిని ఉంచుకోవడం మంచిదా? లేదా కృష్ణ తులసిని ఉంచుకోవడం మంచిదా అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం కృష్ణ తులసిని ఇంట్లో పెంచుకోవడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు.. ఈ తులసి చెట్టును ఇంట్లో పెంచుకుంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఇంట్లో నివసిస్తాడని ఒక నమ్మకం. నలుపు రంగులో కూడిన ఈ తులసి మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల అనేక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయని పురాణాల్లో తెలిపారు. ముఖ్యంగా అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు ఇంట్లో కృష్ణ తులసిని ఉంచుకోవడం ఎంతో మంచిది కృష్ణ తులసికి రోజు ఉదయాన్నే మడికట్టుకుని పూజ చేయడం వల్ల అన్ని రకాల బాధలు తొలగిపోతాయి. ఈ మొక్కను ఇంటి ముందు ఉంచడం వల్ల శ్రేయస్సు తో పాటు ఆనందం కూడా లభిస్తుందని ఒక నమ్మకం..
ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల నల్ల తులసి చెట్లు లభిస్తున్నాయి. ఇందులో కృష్ణ తులసి ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారా? కొన్ని నలుపు రంగు తులసి చెట్లకు ఆకుల వెనకాల పచ్చని రంగు కలిగి ఉంటాయి అయితే ఇలా ఉంటే అసలైన కృష్ణ తులసి కాదు.. ఒరిజినల్ కృష్ణ తులసికి దాదాపు ఆకులు మొత్తం నల్లగానే ఉంటాయి అంతేకాకుండా దాని కాండం కూడా నల్లగా ఉంటుంది. కొన్ని కొన్నిచోట్ల ఎరుపు వర్ణంతో కూడిన మచ్చలు కూడా ఉంటాయి. కృష్ణ తులసి లేని వారు ఇంట్లో రామ తులసిని కూడా నాటవచ్చు.. దీనిని ఇంటికి తూర్పు వైపున నాటడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు.
రామ తులసి కృష్ణ తులసి రెండు మొక్కలు నాటడం వల్ల కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు అయితే ఈ మొక్కలను నాటడమే కాకుండా రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ప్రత్యేకమైన పూజలు చేసి హారతి సమర్పించడం ఎంతో మంచిది. హారతి సమర్పించడం వల్ల తులసి సానుకూల ప్రభావం ఇంట్లో మరింత రెట్టింపు అవుతుంది దీని కారణంగా ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి అంతేకాకుండా ఇంట్లో వారి ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది అలాగే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇంట్లో తూర్పు దిక్కున కృష్ణ తులసిని నాటడం ఎంతో మంచిది.
































