తెల్ల జామ – ఎర్ర జామ.. ఆరోగ్యానికి ఏది మంచిది..? తప్పక తెలుసుకోండి..

తెల్ల జామకాయ సాధారణంగా లేత ఆకుపచ్చ నుండి పసుపు రంగులో ఉంటుంది. లోపల తెల్లని గుజ్జుతో, గింజలు ఎక్కువగా ఉంటాయి. వీటి రుచి కాస్త వగరుగా, తీపిగా ఉంటుంది.


విటమిన్ C, డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఇందులో అధికం. సాధారణంగా వీటిని జెల్లీ, జామ్ తయారీకి ఉపయోగిస్తారు.

పింక్ జామకాయ లోపల గులాబీ రంగు గుజ్జు ఉంటుంది. వీటిలో విటమిన్ Cతో పాటు లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది టమాటాలో ఉండే దాని కంటే కూడా ఎక్కువ. లైకోపీన్ క్యాన్సర్ నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి. పింక్ జామ రుచి చాలా తీపిగా, సువాసన ఘాటుగా ఉంటుంది. వీటిలో గింజలు తక్కువ, కండ ఎక్కువగా ఉండటం వల్ల జ్యూస్‌లు, స్మూతీలు, సలాడ్‌లకు ఇది బెస్ట్ ఆప్షన్.

షుగర్ పేషెంట్లకి రెండు రకాల జామలు మంచివే అయినప్పటికీ, తెల్ల జామకాయ మరింత మేలు చేస్తుంది. తెల్ల జామలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, తద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా పెరగకుండా చూస్తుంది. అందుకే షుగర్ పేషెంట్లకు తెల్ల జామ బెస్ట్ ఆప్షన్‌గా నిపుణులు చెబుతున్నారు.

జామలో తక్కువ క్యాలరీలు ఉండటం, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పింక్ జామలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి.

అంతేకాకుండా తెల్ల జామలో గింజలు ఎక్కువ. పింక్ జామలో తక్కువగా ఉంటాయి. తెల్ల జామ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పింక్ జామలో నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల త్వరగా పాడైపోతుంది. గుండె ఆరోగ్యం, కంటి చూపు మెరుగుపరచడానికి పింక్ జామలో ఉండే లైకోపీన్, కెరోటినాయిడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. మొత్తానికి, జామకాయ ఏ రంగుదైనా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతి రోజూ ఒక జామకాయ తింటే డాక్టర్ అవసరం ఉండదని కూడా నిపుణులు చెబుతారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.