White Hair Remedies: ఆవ నూనెలో ఈ రెండు కలిపి వాడితే.. తెల్ల జుట్టు రమ్మన్నా రాదు

ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలితో పాటు కొన్ని రకాల ఆరోగ్య సమస్యల కారణంగా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు రావడం ప్రారంభం అవుతుంది.


ఇలాంటి సమయంలో చాలా మంది తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి బయట మార్కెట్‌లో షాంపూలతో పాటు, ఆయిల్స్ కూడా వాడుతుంటారు. కానీ ఇవి జుట్టుకే కాదు మన ఆరోగ్యానికి కూడా చాలా హానికరం. ఇలా జరగకుండా, మీరు మీ జుట్టును సహజంగానే నల్లగా మార్చుకోవాలంటే ఆవ నూనెను ఉపయోగించవచ్చు.

ఆవనూనెలో ఒమేగా-3 , విటమిన్లు అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన జుట్టును బలంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఆవ నూనెలో కేవలం రెండు పదార్థాలను కలపడం ద్వారా మీరు మీ జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవచ్చు. మరి జుట్టును నల్లగా చేసే సహజ హెయిర్ ఆవ నూనెను వాడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ ఆయిల్ తయారీ :

స్వచ్ఛమైన ఆవాల నూనె- 1 కప్పు
మెంతులు- 2 టీస్పూన్లు
ఉసిరి పొడి- 2 టీస్పూన్లు

తయారీ విధానం:

ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి ముందుగా మెంతి గింజలను రుబ్బుకుని పౌడర్ తయారు చేసుకోండి. దీని తరువాత గ్యాస్ పై ఒక పాన్ పెట్టి అందులో ఆవాల నూనె వేసి బాగా మరిగించాలి. నూనె మరుగుతున్నప్పుడు మెంతుల పొడితో పాటు ఉసిరి పొడి వేసి ఉడికించాలి. నూనె నల్లగా మారి అన్నీ బాగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడాలి. ఆ నూనెను ఒక గాజు సీసాలోకి వడకట్టి తీసుకోవాలి. తరచుగా ఈ నూనె వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తల స్నానం చేసే గంట ముందు ఆయిల్ జుట్టుకు కుదుళ్లకు బాగా పట్టించి మర్దనా చేయాలి. ఆ తర్వాత నేచురల్ షాంపూతో వాష్ చేసుకోవాలిజ ఈ నూనె మీ జుట్టుకు పోషణనిచ్చి, వాటిని ఆరోగ్యంగా ,నల్లగా మార్చుతుంది.

జుట్టుకు ఉసిరి పౌడర్ రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఉసిరి పౌడర్ లో విటమిన్ సి మాత్రమే కాకుండా అమైనో ఆమ్లాలు , ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. జుట్టుకు ఉసిరి పౌడర్ వాడటం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా మందంగా కూడా తయారవుతుంది. ఉసిరి పౌడర్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కొల్లాజెన్‌ను పెంచుతుంది. అంతేకాకుండా ఆమ్లా పౌడర్ తో తయారుచేసిన హెయిర్ మాస్క్ కూడా తలపై ఉన్న చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

మెంతుల ప్రయోజనాలు:
జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడాన్ని నివారించడానికి మెంతులు కూడా ఉపయోగించబడతాయి. ఇది జుట్టు ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్ , అనేక పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు తల చర్మాన్ని శుభ్రపరచడంలో , చుండ్రు సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.