White Vs Pink Guava : పింక్ రంగు.. తెలుపు రంగు.. రెండింటిలో ఏ జామకాయలు మంచివి.. వేటిని తినాలి.. వీటి మధ్య తేడాలు ఏమిటి..?

www.mannamweb.com


White Vs Pink Guava : సీజనల్‌గా లభించే పండ్లను ఎప్పటికప్పుడు తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే మనకు సీజనల్‌గా వచ్చే వ్యాధులను తగ్గించడంలో ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి.
ఇక చలికాలంలోనూ మనకు పలు రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో జామ పండ్లు కూడా ఒకటి. కానీ వీటిని దోరగా, కాస్త పచ్చిగా ఉన్నప్పుడే తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. జామపండ్ల కన్నా కాయలను తినేందుకే చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ కాలంలో మనకు జామకాయలు చాలా ఎక్కువగా లభిస్తుంటాయి. వీటిని తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

జామకాయలను తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్‌, అసిడిటీ ఉండవు. మలబద్దకం అన్నమాటే ఉండదు. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా జామకాయలను తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు. అయితే జామకాయల్లో లోపలి గుజ్జు పింక్ లేదా తెలుపు రంగుల్లో ఉంటుంది. ఇలా రెండు రకాల జామకాయలు మనకు లభిస్తున్నాయి. అయితే వీటిల్లో ఏది మంచిది.. ఏ రంగు జామకాయలను తింటే ఏం జరుగుతుంది.. వీటి వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి.. అన్న సందేహాలు చాలా మందికి కలుగుతుంటాయి. ఇక అందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
జామకాయల్లో మనకు రెండు రకాలు ఎక్కువగా లభిస్తాయి. లోపలి గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది. ఇవి మనకు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే లోపలి గుజ్జు పింక్ రంగులోనూ ఉంటుంది. ఇవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే లోపలి గుజ్జు తెలుపు రంగులో ఉంటే.. అందులో పిండి పదార్థాలు, విటమిన్ సి, విత్తనాలు అధికంగా ఉంటాయి. అదే పింక్ రంగులో గుజ్జు ఉంటే అందులో పిండి పదార్థాలు, విటమిన్ సి తక్కువగా ఉంటాయి. అలాగే విత్తనాలు కూడా తక్కువగానే ఉంటాయి. కానీ పింక్ రంగులో ఉండే జామకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. కనుక మనకు పింక్ రంగులో ఉండే జామకాయలు కూడా ఉపయోగపడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వాటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
బాక్టీరియా లేదా వైరస్ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు, దగ్గు, జలుబు, క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నవారు తెల్ల రంగు జామకాయల కన్నా పింక్ రంగులో ఉండే జామకాయలను తింటేనే అధికంగా ఫలితం ఉంటుంది. ఆయా వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు. పింక్ రంగులో ఉండే జామకాయల్లో కెరోటినాయిడ్లు అధికంగా ఉంటాయి. కనుకనే ఆ జామకాయల గుజ్జు పింక్ రంగులో ఉంటుంది. పింక్ రంగు, తెలుపు రంగు.. రెండు రకాల జామకాయలను కూడా తింటుండాలి. అప్పుడే మనం జామకాయలతో అన్ని రకాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. కనుక మన ఆరోగ్యానికి రెండు రకాల జామకాయలు మంచివేనని.. రెండింటినీ తగిన మోతాదులో తినాలని.. వైద్యులు సూచిస్తున్నారు.