ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న బబుల్‌ టీ బిజినెస్‌లో పుట్టుకొచ్చిన బిలియనీర్‌!

మీరు ఏదైనా కొత్త బిజినెస్‌ ఐడియా (business ideas in telugu) కోసం చూస్తున్నారా? ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్‌ ఐడియాతో ఎక్కువ లాభం అర్జించాలని అనుకుంటున్నారా? అయితే, ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న కొత్త బిజినెస్‌ ఐడియా ఏంటో తెలుసా? బబుల్‌ టీ. మనకు సాధారణ టీ గురించి, టీ ఫ్రాంచైజీల గురించి తెలుసు. దాని బిజినెస్‌ మోడల్‌ గురించి తెలుసు. మరి బబుల్‌ టీ(Bubble tea). ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్సే ఈ బబుల్‌ టీ బిజినెస్‌. బబుల్‌ టీని అమ్మి తాజాగా 38 ఏళ్ల యునాన్ వాంగ్‌ (Yunan Wang) చైనాలో బిలియనీర్‌ అవతారం ఎత్తారు.


ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం..ఇటీవల యునాన్‌ వాంగ్‌ సంస్థ ‘మింగ్‌ హోల్డింగ్స్’ ఐపీవోకి వెళ్లింది. ఈ ఐపీవోలో అదరగొట్టేలా 233 మిలియన్‌ డాలర్లను సేకరించింది. దీంతో వాంగ్ నికర విలువ 1.2 బిలియన్లకు పెరిగింది. ఫలితంగా చైనా బిలియనీర్ల జాబితాలో చేరిపోయారు. ఇక మింగ్‌ హోల్డింగ్స్ ‘గుడ్‌మీ’ పేరుతో బబుల్‌ టీని విక్రయిస్తుంది. 2023 చివరి నాటికి చైనాలోని తొలి ఐదు బబుల్ టీ బ్రాండ్‌లలో 9.1శాతం మార్కెట్ వాటాతో దూసుకుపోతుంది.