చలికాలం నొప్పులు ఎందుకు వస్తాయి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

శీతాకాలంలో ఒంటినొప్పులు, పంటినొప్పులు పలకరిస్తుంటాయి.తుమ్ములు, చలికి తల బరువెక్కినట్టు అనిపించడం వంటివి ఇబ్బంది వాటితో పడుతుంటాం. దీనికి కారణం చల్లదనానికి శరీరంలోని రక్తం చిక్కబడి ప్రసరణ కొద్దిగా మందగించడమే అంటున్నారు.


వైద్యులు.

ఆహారం విషయంలో

శీతాకాలం ఆహార విషయంలో జాగ్రత్త గా ఉండాల్సిందే. దీని వల్ల జలుబు దగ్గుతో పాటు బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. ఈ కాలంలో చింతపండుతో చేసిన పుల్లని పదార్థాలు ఎక్కువ తినకూడదు వీటివల్లగ్యాస్ సమస్య వస్తుంది. అలాగే కండరాలు నొప్పులు ఎక్కువవుతాయి.

కాని సిట్రజ్ జాతికి చెందిన అరెంజెన్ తినొచ్చు. అలూ, గుమ్మడి, కందగడ్డ లాంటి దుంప కూరలు ఎక్కువగా తినకూడదు. ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటే మంచిది. ఇంటిపని మీరే చేసుకుంటే తొలి బద్దకం తీర శరీరానికి చిన్నపాటి కసరత్తు లభిస్తుంది.

నడుంనొప్పి, కాళ్ల నొప్పులకు కొబ్బరి నూనెను కొద్దిగా వేడిచేసి నొప్పి ఉన్న ప్రదేశంలో మర్దనా చేసుకుని గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఉపశమనం కలుగుతుంది. శరీరానికి వేడిచేసే వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవాలి ఉల్లిపాయ కూరలు తగ్గిస్తే మంచిది. టీ , కాఫీలు ఎక్కువుగా తీసుకునే వాళ్లు లెమన్​ టీ, గ్రీన్​ టీ తీసుకోవచ్చు.

ఒళ్లు నొప్పులు రాకుండా ఉండాలంటే కూర్చున్న చోటే ఉండి పోకూడదు. చలికాలంలో వైరస్ మరింత బలం పుంజుకుని తన సత్తా చూపిస్తుంటుంది. కాబట్టి శరీరానికి వెచ్చదనాన్ని కలిగించాలి. ఎంత చలిగా ఉన్న చిన్నపాటి వ్యాయామం, యోగా చేయాలి. చలికి కళ్లు, చేతులు నొప్పులు అలాగే కాలి వేళ్లు వంకర్లు పోవడం జరుగుతుంటాయి. అలాంటప్పుడు కొద్ది సేపు నడవాలి. చేతులకు సంబంధించిన ఎక్సర్ సైజులు చేయాలి.

ఎందుకంటే

శీతాకాలం ఎక్కడ నొప్పి పుట్టినా, దెబ్బతగిలినా తొందరగా తగ్గదు అంటారు. చలిలో బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువుగా ఉంటుంది. తినే ఆహార వల్ల శరీరం మార్పులకి గురవుతూ ఉంటుంది. మధుమేహం ఉన్నవారికైతే ఈ కాలం కొద్దిగా ఇబ్బందే. చలి వల్ల పంటి నొప్పులు ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. షుగర్ వచ్చిన వాళ్లకి సాధారణంగానే ఎముకల బలం తక్కువ. కాబట్టి వారికి ఒళ్లు నొప్పులు చలికాలంలో మిగిలిన వారికంటే ఎక్కువగా ఉంటాయి.

మరింత సాధారణంగా ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఆర్థరైటిస్’ సమస్య వస్తుంది శీతాకాలంలో అది మరింత ప్రభావం చూపుతుంది. ఈ కాలంలో జ్వరం వచ్చినా ఒక పట్టాన తగ్గదు. దాంతో ఒళ్లు నొప్పులు ఎక్కువ అవుతాయి. పిల్లలు ఆటల్లో పడి దెబ్బలు తగిలించుకుంటే ఆ దెబ్బలు తగ్గేందుకు కూడా చాలా రోజులు పడుతుంది. ఎక్కువసేపు ఏసీరూముల్లో ఉన్నా ఈ కాలంలో ఒంటి నొప్పులు ఎక్కువవొచ్చు.

ఇలాంటివి జరగొచ్చు

వింటర్లో మంచు, చల్లదనంతోపాటు ప్రమాదాలను కూడా కలిగిస్తుంది. పొద్దుపొద్దునే ఆఫీసులకి వెళ్లేవారు బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోతే… యాక్సిడెంట్స్ జరిగే ప్రమాద ముంటుంది. పిల్లలు ఇనుప వస్తువులతో అటలాడకూడదు.. వాటివల్ల ఏదైనా గాయమైతే త్వరగా తగ్గకుండా సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉపటుంది. అలాగే గ్రామాలలో ఉండేవారు.. పొలం పనులు చేసుకునే వాళ్లు గట్లపై జాగ్రత్తగా నడవాలి. మంచుకు పచ్చగడ్డిపై తడిచేరి అడుగు వేస్తే జారుతుంది

జాగ్రత్తలు

చలికి భయపడి ఏపనీ చేయకుండా ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోకూడదు. అలాగే ఎక్కువసేపు గది తలుపులు తీయకుండా కూడా ఉండకూడదు. కొద్దిసేపైన తాజా గాలి గదిలోపలికి వచ్చేట్లు చూడాలి. చలి ఎంత ఇబ్బంది పెడు తున్నా పొద్దున్న కాసేపు వ్యాయామం చేయాలి.

అలాగని మోకాలి నొప్పులు, నడుం నొప్పి ఎక్కువగా ఉన్నవారు వ్యాయామం ఎక్కువగా చేయకూడదు. దానివల్ల కండరాలు పట్టేసే అవకాశం ఉంటుందంటున్నారు వైద్యులు. అలాగే కొద్దిసేపు ఎండలో నడిస్తే మంచిది. ఉద్యోగాలు చేసేవాళ్లు. ఆఫీసులో సీటుకి అతుక్కుపోకుండా కొద్దిసేవు నడుము.. కాళ్లు కదిలేలా చిన్నపాటి ఎక్సర్సైజ్ చేస్తే మంచిది.

లిఫ్ట్ ఉపయోగించకుండా మెట్లు ఎక్కి వెళ్లడం బాడీకి వామప్​ అవుతుంది. బయట ఎక్కువ తిరిగేవారు స్వెట్టర్ దగ్గర పెట్టు కుంటే మంచిది. ఏసీ ఉన్న గదిలో పనిచేసేవారు గంటకొక సారైనా బయటరు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి. ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళయితే కొద్దిసేపు ఎండలో వాకింగ్ చేయాలి. అలాగే కోల్డ్ కాఫీలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది…

చలి ఎక్కువగా ఉంటే

శీతాకాలంలో ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు కొంచెం ఎక్కువే తీసుకోవాలి. కీళ్లవాతం ఉన్నవాళ్ళు. ఆస్తమా ఉన్నవాళ్లు మందులు వేసుకోవడం మానకూడదు. శరీరానికి వెచ్చదనాన్పిచ్చే బట్టలు వేసుకోవాలి. ఏసీ గదుల్లో పని చేసేవారు. రాత్రివేళల్లో బయలు పనిచేసేవాళ్లు చేతులకు గ్లవుజులు వేసుకోవాలి.

ఇంట్లోని గచ్చు మార్పుల్ స్టోన్ అయితే తప్పని సరిగా చెప్పులు వాడాలి. దానికుండే చల్లదనం వల్ల కాళ్లు నొప్పులు వస్తాయి. బయట ఎక్కువ తిరిగేవాళ్లు. ..బాలింతలు స్వెట్టర్స్ తప్పకుండా ధరించాలి. చంటిపిల్లలను చల్లగాలిలో ఎక్కువ సేపు తిప్పకూడదు. ఎక్కువ చలి ఉంటే రక్త ప్రసరణ మీద ప్రభావం పడి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. శీతాకాలంలో తప్పని సరిగా వాకింగ్, జాగింగ్ లాంటివి చేస్తే రక్త సరఫరా సజావుగా సాగి జబ్బులు, నొప్పులు రావని వైద్య నిపుణులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.