ఇండియన్ పాస్‌పోర్టులు 4 రంగుల్లో ఎందుకుంటాయి? వీటి మీనింగ్ ఏంటో తెలుసా?

 ఏ దేశ పౌరులకైనా పాస్‌పోర్ట్ (Passport) కీలక డాక్యుమెంట్లలో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికెళ్లినా ఈ డాక్యుమెంట్‌ స్టాండర్డ్ ఐడెంటిఫికేషన్‌గా పనిచేస్తూ ఇంటర్నేషనల్ బార్డర్స్‌ని దాటడానికి వీలు కల్పిస్తుంది.
అయితే, మన దేశంలో పాస్‌పోర్టులు 4 రంగుల్లో కనిపించడం చూస్తుంటాం. రెడ్, బ్లూ, వైట్, ఆరెంజ్ కలర్స్‌లో ఇండియన్ పాస్‌పోర్టులు ఉంటాయి. మరి, ఈ కలర్ కోడ్ వెనుక మీనింగ్ ఏంటి? ఒక్కో రకమైన పాస్‌పోర్ట్ దేనికోసం ఇష్యూ చేస్తారో తెలుసుకుందాం.


వైట్ పాస్‌పోర్ట్
సివిల్ సర్వీసెస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, సైనిక అధికారులు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు ఈ వైట్ పాస్‌పోర్ట్ ఇష్యూ అవుతుంది. ఈ కార్డు తీసుకోవడానికి చాలా టఫ్ ప్రాసెస్ ఉంటుంది. దీనికోసం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుంచి పర్మిషన్‌తో పాటు అప్లికెంట్స్ అధికారిక గవర్నమెంట్ ఐడీ, డిపార్ట్‌మెంట్ నుంచి డ్యూటీ సర్టిఫికెట్, అఫిషియల్ ఫార్వర్డింగ్ లెటర్ అవసరం.

రెడ్ పాస్‌పోర్ట్
ఈ రెడ్ పాస్‌పోర్ట్‌ను డిప్లొమాట్లు, ప్రభుత్వంలోని హైయ్యర్ అఫిషియల్స్, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఇస్తారు. అందుకే, దీనిని డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ అని కూడా పిలుస్తుంటారు. వైట్ పాస్‌పోర్ట్ మాదిరిగానే దీనికి కూడా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పర్మిషన్ పొందాల్సి ఉంటుంది. దీంతో పాటు అధికారిక ఐడీ, డ్యూటీ సర్టిఫికెట్, డిపార్ట్‌మెంటల్ రికమెండేషన్ లెటర్ అవసరం.

ఆరెంజ్ పాస్‌పోర్ట్
ఈ పాస్‌పోర్ట్ భారతీయ పౌరుల్లో కొందరికి మాత్రమే ఇష్యూ చేస్తారు. విదేశీ ప్రయాణం చేయడానికి అవసరమైన కనీస విద్యార్హత లేనివారికి దీన్ని ఇస్తారు. పనికోసం గల్ఫ్ వంటి దేశాలకు వెళ్లే నిరక్ష్యరాస్యులకు దీనిని కేటాయించారు. వీరికి ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ECR) స్టేటస్ కింద పాస్‌పోర్ట్‌ని ఇస్తారు.

బ్లూ పాస్‌పోర్ట్
మనకు ఎక్కువగా కనిపించే పాస్‌పోర్టుల్లో బ్లూ కలర్ ఒకటి. దీనిని సాధారణ పాస్‌పోర్ట్‌గానూ వ్యవహరిస్తారు. ఇది భారత సాధారణ పౌరుల కోసం డిజైన్ అయింది. వ్యాపారం, చదువులు, విశ్రాంతి లేదా పర్యాటకం వంటి ట్రావెల్ బెనిఫిట్స్ కోసం దీనిని ఇష్యూ చేస్తారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా దీని కోసం అప్లై చేసుకోవచ్చు. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లేదా పాన్ కార్డ్ వంటి వ్యాలిడ్ ఫొటో ఐడీ, విద్యుత్ బిల్లు లేదా రెంటల్ అగ్రీమెంట్ వంటి రెసిడెన్స్ ప్రూఫ్, ఓటర్ ఐడీ కార్డ్ వంటి డాక్యుమెంట్లను అటాచ్ చేయాలి. దీనిని ఇ- పాస్‌పోర్టుగా కూడా పొందవచ్చు.

పాస్‌పోర్ట్‌ కలర్ కోడింగ్ ఎందుకంటే?
పాస్‌పోర్ట్ కలర్ కోడింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్‌పోర్ట్‌లలో ఇమిగ్రేషన్ ప్రాసెస్ మరింత సులభతరం చేయడానికి దీనిని తీసుకొచ్చారు. పాస్‌పోర్ట్ కలర్ సాయంతో సదరు ప్యాసింజర్ పౌరుడా, ప్రభుత్వ అధికారా, దౌత్యవేత్తనా లేదా ఒక నిర్దిష్ట వర్గం కింద పనికోసం విదేశాలకు వెళ్తున్నాడా? అనేది తెలియజేస్తుంది.

మరోవైపు, ట్రావెల్ పర్పస్‌ని కూడా పాస్‌పోర్ట్ సూచిస్తుంది. ప్యాసింజర్ ఐడెంటిటీని ఒక గ్లాన్స్‌లో కన్ఫర్మ్ చేయడానికి ఇమిగ్రేషన్ అధికారులకు హెల్ప్ చేస్తుంది. రీసెంట్‌గా తీసుకొచ్చిన అడ్వాన్స్‌డ్ బయోమెట్రిక్ ఇ- పాస్‌పోర్ట్ సైతం భారతీయ పౌరులకు ఇంటర్నేషనల్ ట్రావెల్‌ని వేగంగా, సురక్షితంగా, ఇబ్బంది లేకుండా అందిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.