అద్దాల మేడలో, ధగధగలాడే లైటింగ్స్ మధ్య.. ఉన్నోళ్లు మాత్రమే అలాంటి దుస్తులు వేసుకోగలరేమో అనుకునేలా ఉంటుందది. లోపలికి ఎంటర్ అయితే.. పేదవాళ్లు సైతం 150 రూపాయలు పెట్టి ఓ బ్రాండెడ్ టీ-షర్ట్ కొనుక్కోగలిగినంత రేట్లు ఉంటాయి.
అదే జూడియో. ఇక జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్. హై-నెట్‌వర్త్ ఉన్నోళ్లు మాత్రమే కొనగలిగే లగ్జరీ కార్లు అవి. అంటే..
పేదోళ్లకి, ఉన్నోళ్లకి మధ్య తేడా గమనించి దానికి తగ్గట్టుగా వ్యాపారం చేసే ఒకే ఒక్క బిజినెస్‌మాన్ రతన్ టాటా. వ్యాపారం ఎంత పెద్ద స్థాయిలో చేసినా సరే.. సామాన్యుడి సైతం దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేసే ఒకే ఒక్కడు రతన్ టాటా. ‘ఇలాంటి వ్యక్తి ఇంతకుముందు లేరు, ఇకపై ఉండరు’..
రతన్ టాటా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఇంతకు మించి చెప్పలేం. అయినా సరే.. ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను కచ్చితంగా చెప్పుకోవాల్సిందే