మొదటి స్వాతంత్య్ర వేడుకల్లో గాంధీ ఎందుకు లేరు.. 1947, ఆగస్టు 15న అసలేం జరిగిందంటే?

దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 1947 సంవత్సరంలో ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు చేసిన కృషికి గానూ భారతదేశానికి స్వతంత్య్రం వచ్చింది.


ఈ క్రమంలో అనాడు వారు చేసిన పోరాటలు, ఆ మహనీయులు చేసిన కృషిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడి పై ఉంది. భారతదేశం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉంది. దేశం విదేశీ పాలకుల నుంచి స్వేచ్ఛను సాధించాలని ఎందదరో దేశభక్తులు ఎన్నో పోరాటాలు చేశారు. ఈ తరుణంలోనే 1857లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టానికి విరుద్ధంగా, మొట్టమొదటి క్రూసేడ్ జరిగింది.

తరువాత, భారతదేశం స్వాతంత్య్రం కోసం అనేక పేర్లతో ఉద్యమాలు చేసింది. వాటిలో భారతీయ తిరుగుబాటు, 1857 సిపాయిల తిరుగుబాటు, గొప్ప తిరుగుబాటు, భారతదేశ మొదటి స్వాతంత్య్ర యుద్ధం అనే పేర్లతో స్వాతంత్య్రం కోసం పోరాడింది. ఈ క్రమంలో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం సాధించడంలో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ పాత్ర కీలకం. ఆయన తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులు వచ్చారు. భారతీయ స్వాతంత్య్ర పోరాటాల ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్య్రం వచ్చింది. స్వాతంత్య్రం తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యారు.

1947, ఆగస్టు 15న అసలేం జరిగిందంటే..

స్వాతంత్య్ర వేడుకలు మరియు అధికార బదిలీ కోసం దేశ రాజధాని ఢిల్లీని ముస్తాబు చేస్తుండగా, భారతీయులు స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతుండగా, స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎక్కడ? బాపు ఎక్కడ ఉన్నారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారత తొలి స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహాత్మగాంధీ ఢిల్లీకి దూరంగా బెంగాల్‌లోని నోవాఖలీలో ఉన్నారు. ఆ సమయంలో హిందూ ముస్లిం ఘర్షణలను ఆపడానికి మహాత్మా గాంధీ నిరాహార దీక్ష చేస్తున్నారు. 1947, ఆగస్టు 15న ఢిల్లీ వేడుకల్లో పాల్గొని ఆశీస్సులు ఇవ్వాలని నెహ్రూ, పటేల్ ఆయనను కోరారు. దానికి గాంధీ.. ”కలకత్తాలో హిందూ, ముస్లింలు పోరాడుతున్నప్పుడు నేను సంబరాలకు ఎలా రాగలను ఈ ఘర్షణలు ఆపడానికి నా ప్రాణాలు కూడా ఇస్తాను” అని బదులిచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.