నిద్రిస్తున్న భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

www.mannamweb.com


కుటుంబ కలహాలు పెనుభూతమయ్యాయి. దీంతో విచక్షణ కోల్పోయిన భార్య నిద్రిస్తున్న టైంలో భర్తను గొడ్డలితో నరికి హత్య చేసిన దారుణ ఘటన నాగర్​కర్నూల్​జిల్లాలో చోటుచేసుకుంది.

లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన భార్య ఎల్లమ్మ నిన్న రాత్రి భర్త రాములను గొడ్డలితో నరికి కిరాతంగా చంపింది.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.