గరుడ పురాణం హిందూ ధర్మం యొక్క పద్దెనిమిది మహాపురాణాలలో ఒకటి. ఇందులో మరణం, పునర్జన్మ, ధర్మం, భక్తి , మోక్షం మార్గాల గురించి ఉంది. గరుడ పురాణం ప్రకారం భర్త తన భార్యను హింసించే వ్యక్తికి నరకంలో స్థానం లభిస్తుందా లేదా అని తెలుసుకుందాం.
గరుడ పురాణం ఏడవ అధ్యాయం ప్రకారం భర్త తన భార్యతో చెడుగా ప్రవర్తిస్తే, అతను చనిపోయిన తరువాత నేరుగా ‘రౌరవ నరకం’ లోకి వెళతాడు. రౌరవ నరకంలో రురు అనే భయంకరమైన పాములు ఉంటాయి
భార్యను విడిచిపెట్టి పరస్త్రీతో సంబంధం పెట్టుకునే పురుషుడు మరణానంతరం ‘కుంభినీపాక’ అనే ఘోర నరకంలో తీవ్రమైన బాధలు అనుభవిస్తాడు,
భర్త తన భార్యకు నమ్మకంగా ఉండటం అవసరమని, పరస్త్రీని కోరుకోవడం పాపం అని, దీనికి మరణానంతరం నరకంలో భయంకరమైన బాధలు అనుభవించవలసి వస్తుందని గురడపురాణంలో ఉంది
భార్య భావాలను పట్టించుకోని, ఆమెతో సరిగ్గా ప్రవర్తించని భర్త, అలాగే భార్యతో బలవంతంగా ఆమెకు అంగీకారం లేని పని చేయించే భర్త, లౌకిక జీవితంలోనే కాదు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా పతనమవుతాడు. అలాంటి వ్యక్తి ఘోరమైన పాపం చేసినట్టే
భార్యను గౌరవించడం ముఖ్యం.. ఎందుకంటే ఆమె కుటుంబానికి మూలస్తంభం. బంధంలో సమతుల్యత.. ఆనందం , పరస్పర అవగాహనను తెస్తుంది. ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది, ఇది జీవితంలోని ప్రతి అంశంలో ఆనందం, శాంతిని తెస్తుంది. ఇది పూర్తిగా భర్త ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని వివరిస్తుంది గరుడపురాణం


































