నగలు కొంటే నోటీసులు వస్తాయా?

ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు లేదా శుభకార్యాల సమయంలో బంగారం (Gold) కొనడం ఒక సంప్రదాయం. అయితే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. మీరు రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే..


తప్పనిసరిగా పాన్ (PAN) లేదా ఆధార్ కార్డు వివరాలను జ్యువెలరీ షాపులో ఇవ్వాల్సి ఉంటుంది. 2016 జనవరి నుంచి ఈ నిబంధన అమలులో ఉంది. కానీ, అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో, బడ్జెట్ 2026 లో ఈ రూ. 2 లక్షల పరిమితిని పెంచాలని ట్యాక్స్ నిపుణులు , జ్యువెలరీ అసోసియేషన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

రూ. 2 లక్షల లిమిట్ ఎందుకు పెంచాలి?

చార్టర్డ్ అకౌంటెంట్ సురేష్ సురానా వంటి నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2016లో రూ. 2 లక్షలకు వచ్చే బంగారానికి, ఇప్పుడు వచ్చే బంగారానికి చాలా తేడా ఉంది. ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఇప్పుడు అతి తక్కువ బరువున్న నగలు కొన్నా కూడా ఈజీగా రూ. 2 లక్షల మార్కును దాటేస్తున్నాయి. దీనివల్ల సాధారణ మధ్యతరగతి ప్రజలు కూడా అనవసరంగా ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్టింగ్ పరిధిలోకి వస్తున్నారు. కేవలం ధర పెరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది తప్ప, కొనే పరిమాణం పెరగడం వల్ల కాదు. అందుకే ఈ లిమిట్‌ను కనీసం రూ. 5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పారదర్శకత , సామాన్యుడి ఇబ్బందులు నిజానికి, ప్రభుత్వం ఈ రూ. 2 లక్షల నిబంధనను తీసుకువచ్చింది నల్లధనాన్ని అరికట్టడానికి. పెద్ద మొత్తంలో నగదుతో బంగారం కొనేవారిపై నిఘా ఉంచడం దీని ప్రధాన ఉద్దేశం.

నిపుణుల ప్రతిపాదనలు ఏమిటి?

అయితే, ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ పెరిగిన తర్వాత కూడా ఈ తక్కువ పరిమితి ఉండటం వల్ల చిన్న చిన్న వ్యాపారులు , సాధారణ కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. బడ్జెట్ 2026 లో ఈ పరిమితిని పెంచితే, మధ్యతరగతి కుటుంబాలకు పెళ్లిళ్ల సమయంలో కాస్త ఊరట లభిస్తుంది. ఈ పరిమితిని కేవలం ఒక ఫిక్స్‌డ్ నెంబర్‌గా కాకుండా బంగారం ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే ధర పెరిగినప్పుడు లిమిట్ కూడా పెరగాలి. దీనివల్ల నిజంగా భారీ ఎత్తున పెట్టుబడి పెట్టే వారిని మాత్రమే ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ట్రాక్ చేయగలుగుతుంది. అలాగే జ్యువెలర్స్ కూడా ఎస్‌ఎఫ్టీ (SFT) రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు తక్కువ మొత్తాలకు సంబంధించి ఎక్కువ పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. మొత్తానికి బంగారం ధరలు 2026 లో రికార్డు స్థాయికి చేరుకున్న తరుణంలో ఈ పాత నిబంధనలు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.