అయితే ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ కేవలం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనినేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) హైవేలపై మాత్రమే పనిచేస్తుంది. రాష్ట్రప్రభుత్వం అధికారులు నిర్వహించే హైవేలు, ఎక్స్ ప్రెస్ వేలు, ఔటర్ రింగురోడ్డులలో చెల్లుబాటు కాదు.
తెలంగాణలోని కొన్ని హైవేలపై మాత్రమే ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ చెల్లుతుంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే నేషనల్ హైవే 65 పై ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ చెల్లుతుంది. అలాగే హైదరాబాద్ టు జడ్చర్ల హైవే పై టోల్ గేట్ల దగ్గర కూడా చెల్లుబాటు అవుతుంది.
తెలంగాణలో ఈ మార్గాల్లో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ చెల్లదు.. టోల్ ఛార్జీలు చెల్లించాల్సిందే
రాష్ట్ర రహదారి 1 హైదరాబాద్ – కరీంనగర్ – రామగుండం రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో
రాష్ట్ర రహదారి 2 నార్కట్‌పల్లి – మిర్యాలగూడ – నాగార్జునసాగర్ నల్గొండ జిల్లాలో
రాష్ట్ర రహదారి 3 వరంగల్ – నర్సింహులపేట క్రాస్ రోడ్ – ఖమ్మం వరంగల్, ఖమ్మం జిల్లాలో
రాష్ట్ర రహదారి 4 హైదరాబాద్ – చేవెళ్ల – పరిగి – కొడంగల్ రంగారెడ్డి
రాష్ట్ర రహదారి 6 హైదరాబాద్ – మెదక్ – బోధన్ రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్
రాష్ట్ర రహదారి 11 కరీంనగర్ – కామారెడ్డి – ఎల్లారెడ్డి కరీంనగర్ – నిజామాబాద్
రాష్ట్ర రహదారి 12 భద్రాచలం – జగన్నాధపురం ఖమ్మం
రాష్ట్ర రహదారి 15 సిద్దిపేట – రామాయంపేట – మెదక్ మెదక్
రాష్ట్ర రహదారి 17 భువనగిరి – నర్సాపూర్ – సంగారెడ్డి నల్గొండ, మెదక్
రాష్ట్ర రహదారి 18 నల్గొండ – మల్లేపల్లి – జడ్చర్ల నల్గొండ, మహబూబ్‌నగర్
రాష్ట్ర రహదారి 19 హైదరాబాద్ – ఇబ్రహీంపట్నం – కొండమల్లేపల్లి – నాగార్జున సాగర్ నల్గొండ, మహబూబ్‌నగర్
రాష్ట్ర రహదారి 20 మహబూబ్ నగర్ – భూత్‌పూర్ – బిజ్నాపల్లి – శ్రీశైలం మహబూబ్‌నగర్
రాష్ట్ర రహదారి 21 జడ్చర్ల – దేవునిపాలెం – వనపర్తి – కొత్తకోట మహబూబ్‌నగర్
రాష్ట్ర రహదారి 23 మహబూబ్ నగర్ – కొడంగల్ – తాండూరు – పొలకపల్లి మహబూబ్‌నగర్
రాష్ట్ర రహదారి 24 నిర్మల్ – జన్నారం – జాతీయ రహదారి ఆదిలాబాదు
































