బంగారం ధర 80 వేలు దాటుతుందా? కారణం ఏమిటి?

www.mannamweb.com


బంగారం అనేది చాలా మందికి సురక్షితమైన పెట్టుబడి. భారత్‌లో బంగారంపై పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య భారీగానే ఉంది. సామాన్యులే కాదు ధనవంతులు కూడా బంగారంపై పెట్టుబడి పెడతారు.

ఎందుకంటే కష్ట సమయాల్లో ఇది ఉపయోగపడుతుంది. గత కొన్ని నెలలుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ ఇటీవల నుంచి భారీగానే పెరుగుతోంది. కేంద్రం బడ్జెట్‌కు ముందు పెరిగిన బంగారం.. బడ్జెట్‌ ప్రకటన తర్వాత ఒక్కసారిగా దిగి వచ్చింది. అలాగే కొన్ని రోజులు కొనసాగి.. ఇప్పుడు పరుగులు పెడుతోంది. రాబోయే రోజుల్లో తులం బంగారం ధర రూ.80 వేలకుపైగానే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం చోటు చేసుకోవడంతో ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. కానీ బంగారానికి డిమాండ్ పెరిగితే దాని ధర 80 వేలు దాటవచ్చు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి.

ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదం పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో బంగారం ధర పెరుగుతోంది. ప్రస్తుతం వృద్ధి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర రూ.77 వేలకుపైగా ఉంది. ఇప్పుడు బంగారం 80 వేలు దాటుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

బంగారం ధర రూ.80వేలు దాటితే సామాన్యులకు మరింత భారంగా మారుతుంది. దీనిపై మార్కెట్ విశ్లేషకుడు, హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీ కమోడిటీస్ హెడ్ అనూజ్ గుప్తా మాట్లాడుతూ బంగారం ధర 10 గ్రాములకు రూ.80,000 దాటే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం అక్టోబర్‌ 7 సాయంత్రం 5 గంటల సమయానికి తులం బంగారం ధర రూ.77,670 ఉంది.

వెండికి డిమాండ్

వెండికి కూడా డిమాండ్ పెరిగింది. చైనా తన ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టింది. దీంతో వెండి ధర పెరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.96,900 వద్ద కొనసాగుతోంది.