మీరు విండోర్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నారా. దీన్ని ద్వారా మీ కంప్యూటర్, పర్సనల్ లాప్ ట్యాప్ లలో పనులు చేస్తున్నారా. అయితే ప్రభుత్వం జారీ చేసిన హైరిస్క్ హెచ్చరిక మీకోసమే.
విండోస్ 10, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్స్ లో భద్రతా పరమైన లోపాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వెంటనే వాటిపై యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. వాటి ద్వారా నేరగాళ్ల మన సిస్టమ్ లోని విలువైన సమాచారం చోరీ చేసే ప్రమాదం ఉందని తెలిపింది.
అసలేం జరిగిందంటే..
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్ ఇన్) ఈ విషయాన్ని గుర్తించింది. విండోస్ 10, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్స్ లో రెండు భద్రతా పరమైన లోపాలను ఉన్నట్టు పసిగట్టింది. వర్చువలైజేషన్ బేస్డ్ సెక్యూరిటీ, విండోస్ బ్యాకప్ కి మద్దతు ఇచ్చే విండోస్ బేస్డ్ సిస్టమ్స్ లో ఈ లోపాలను గమనించింది. వీటి ద్వారా హ్యాకర్లు మనం గతంలో తొలగించిన డేటాను తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉందని, వీబీఎస్ సెక్యూరిటీని నాశనం చేసే వీలు కూడా ఉంటుందని తెలిపింది.
పరిష్కారమిదే..
విండోస్ ఓఎస్ లోని ఈ లోపాలపై వాటి యూజర్లకు సెర్ట్ ఇన్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమస్య పరిష్కారానికి మైక్రోసాఫ్ట్ అవసరమైన జాగ్రత్తలు తీసుకుందని వివరించింది. ఆ సంస్థకు చెందిన తాజా సెక్యూరిటీ ప్యాచ్ లో వీటిని సమర్థంగా ఎదుర్కొనే ఆయుధాలు ఉన్నాయని తెలిపింది. కాబట్టి వెంటనే యూజర్లు మైక్రోస్టాఫ్ట్ లేటెస్ట్ అప్ డేట్ ను డౌన్ లోడ్ చేసుకుని, తమ కంప్యూటర్లలో ఇన్ స్టాల్ చేసుకోవాలని కోరింది.
అప్ డేట్ చేసుకోవాల్సిన విండోస్ వెర్షన్లు
విండోస్ 10కు సంబంధించి..
విండోస్ సర్వర్ 2016 (సర్వర్ కోర్ ఇన్‌స్టాలేషన్)
విండోస్ సర్వర్ 2016
విండోస్ 10 వెర్షన్ 1607 ఫర్ ఎక్స్ 64 బేస్ సిస్టమ్స్
విండోస్ 10 వెర్షన్ 1607 ఫర్ ఎక్స్ 32 బిట్ సిస్టమ్స్
విండోస్ 10 ఫర్ ఎక్స్ 64 బేస్డ్ సిస్టమ్స్
విండోస్ 10 ఫర్ ఎక్స్ 32 బేస్డ్ సిస్టమ్స్
విండోస్ 10 వెర్షన్ 1809 ఫర్ ఏఆర్ఎం 64 బిట్ సిస్టమ్స్
విండోస్ 10 వెర్షన్ 1809 ఫర్ 64 బిట్ సిస్టమ్స్
విండోస్ 10 వెర్షన్ 1809 ఫర్ 32 బిట్ సిస్టమ్స్
విండోస్ 10 వెర్షన్ 22 హెచ్2ఫర్32 బిట్ సిస్టమ్స్
విండోస్ 10 వెర్షన్ 22 హెచ్2ఫర్ ఏఆర్ ఎం 64 బిట్ సిస్టమ్స్
విండోస్ 10 వెర్షన్ 22 హెచ్2ఫర్ ఎక్స్ 64 బిట్ సిస్టమ్స్
విండోస్ 10 వెర్షన్ 21 హెచ్2ఫర్ ఎక్స్ 64 బిట్ సిస్టమ్స్
విండోస్ 10 వెర్షన్ 21 హెచ్2ఫర్ ఏఆర్ ఎం 64 బిట్ సిస్టమ్స్
విండోస్ 10 వెర్షన్ 21 హెచ్2ఫర్ 32 బిట్ సిస్టమ్స్
విండోస్ 10 వెర్షన్ 21 హెచ్2ఫర్ 32 బిట్ సిస్టమ్స్
విండోస్ 11కు సంబంధించి..
విండోస్ 11 వెర్షన్ 24 హెచ్ 2ఫర్ ఎక్స్ 64 బేస్డ్ సిస్టమ్స్
విండోస్ 11 వెర్షన్ 24 హెచ్ 2ఫర్ ఏఆర్ఎం 64 బేస్డ్ సిస్టమ్స్
విండోస్ 11 వెర్షన్ 23 హెచ్ 2ఫర్ ఎక్స్ 64 బేస్డ్ సిస్టమ్స్
విండోస్ 11 వెర్షన్ 23 హెచ్ 2ఫర్ ఏఆర్ఎం 64 బేస్డ్ సిస్టమ్స్
విండోస్ 11 వెర్షన్ 22 హెచ్ 2ఫర్ ఎక్స్ 64 బేస్డ్ సిస్టమ్స్
విండోస్ 11 వెర్షన్ 22 హెచ్ 2ఫర్ ఏఆర్ఎం 64 బేస్డ్ సిస్టమ్స్
విండోస్ 11 వెర్షన్ 21 హెచ్ 2ఫర్ ఎక్స్ 64 బేస్డ్ సిస్టమ్స్
విండోస్ 11 వెర్షన్ 21 హెచ్ 2ఫర్ ఏఆర్ఎం 64 బేస్డ్ సిస్టమ్స్
విండోస్ సర్వర్ 2019 (సర్వర్ కోర్ ఇన్‌స్టాలేషన్)
విండోస్ సర్వర్ 2019
విండోస్ సర్వర్ 2022
విండోస్ సర్వర్ 2022 (సర్వర్ కోర్ ఇన్‌స్టాలేషన్)
విండోస్ సర్వర్ 2022, 23 హెచ్ 2 ఎడిషన్ (సర్వర్ కోర్ ఇన్‌స్టాలేషన్