ఒక్క క్లిక్ తో.. మీ మొత్తం చరిత్ర మీకు తెలియజేస్తుంది.

అనారోగ్యాలకు చికిత్సతో పాటు కొన్ని యాప్‌లు ప్రధానంగా ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్‌పై దృష్టి పెడుతున్నాయి. వైద్యులను, వైద్య పరీక్షలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఒక వ్యక్తి రోజువారీ ఫిట్‌నెస్‌ వివరాలు, రక్తపోటు హెచ్చు తగ్గులు, షుగర్‌ లెవెల్స్‌ వంటి వాటిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. రోగులకు, వైద్యులకు రిమోట్‌ యాక్సెస్‌ ద్వారా పరిస్థితిని వివరించడానికి చాట్‌ చేసే సౌకర్యం, వీడియో కాల్స్‌ వంటివెన్నో అందుబాటులోకి వచ్చేశాయి.చాలా మందికి ప్రిస్క్రిప్షన్‌ దాచుకునే అలవాటు ఉండదు. జబ్బు నయం కాగానే ప్రిస్క్రిప్షన్‌ పడేయడమో లేదా ఎక్కడో పోగొట్టుకోవడమే చేస్తుంటారు. భవిష్యత్తులో ఆరోగ్య చికిత్సలకు ప్రిస్క్రిప్షన్‌ అనేది అత్యంత కీలకం అంటున్నారు నిపుణులు. అందుకే ఇప్పుడు డిజిటల్‌ హెల్త్‌ రికార్డ్స్‌ రూపంలో వ్యక్తికి సంబంధించిన డేటా మొత్తం భద్రంగా ఉంటుందని చెబుతున్నారు. ఒక వ్యక్తికి వచ్చిన జబ్బు వంశపారం పర్యంగా వచ్చిందా? లేదా జీవనశైలి కారణంగా సంక్రమించిందా అని గుర్తించడం ట్రీట్‌మెంట్‌లో కీలకం. అందుకే వ్యక్తి ఆరోగ్య చరిత్ర, ఫ్యామిలీ హిస్టరీ వంటివన్నీ డిజిటల్‌ రికార్డ్స్‌గా భద్రపరిచి యాప్స్‌తో అనుసంధానించే కార్యక్రమాలకు నిపుణులు ప్రణాళికలు వేస్తున్నారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.