గులాబీ రేకులతో పైల్స్ సమస్య మాయం.. ఇంకా మెరిసే అందం మీ సొంతం

www.mannamweb.com


గులాబీ అంటేనే అందం. ఎన్ని పూలు ఉన్నా గులాబీలకు వచ్చే ఎట్రాక్షన్ వేరు. చాలా మందికి గులాబీలు అంటే ఇష్టం. గులాబీల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కానీ ఎక్కువగా చాలా మంది ఎరుపు, డార్క్ పింక్ రంగులో ఉండే గులాబీలను ఉపయోగిస్తూ ఉంటారు.

ఇంట్లో కూడా ఈ రెండు రంగులకు సంబంధించిన మొక్కలనే పెంచుతారు. గులాబీలు కేవలం అందం, ఆకర్షణ కోసమే కాదు.. ఇందులో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కొన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి గులాబీ రేకులను ఉపయోగించే వారు. గులాబీ రేకులతో ప్రయోజనాలతో పాటు ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయి. దేశవాళీ గులాబీలు మరింత ఉపయోగ పడతాయి. వీటితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

పైల్స్‌తో పోరాడుతుంది:

గులాబీ రేకులతో పైల్స్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. గులాబీ రేకుల్లో డిజెస్టివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి పైల్స్ సమస్యను తగ్గించడంలో ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇవి జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. గులాబీ పూలను తీసుకోవడం వల్ల పుళ్లు కూడా త్వరగా మానతాయి.

వెయిట్ లాస్ అవుతారు:

చాలా మంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి మీరు మీ డైట్‌లో వీటిని యాడ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ గులాబీ రేకులతో మీరు టీ చేసుకుని.. రోజులో రెండు పూటలు తాగండి. ఇలా తాగడం వల్ల.. జీర్ణ క్రియ అనేది మెరుగు పడి.. త్వరగా బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది.

చర్మ సమస్యలు దూరం చేసుకోవచ్చు:

గులాబీ రేకులను ఎక్కువా చర్మ సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్లో లభ్యమయ్యే పలు ప్రాడక్ట్స్‌లో కూడా గులాబీ రేకులను యూజ్ చేస్తారు. దేశవాళీ గులాబీ రేకులను ప్రతి రోజూ కొన్ని నమిలి తినడం వల్ల చర్మం ఎంతో యవ్వనంగా, తాజాగా మెరుస్తుంది. ముఖంపై డల్ నెస్ పోతుంది. ఈ గులాబీ రేకులను టీలా, వంటల్లో, సలాడ్స్‌లో కూడా ఉపయోగించవచ్చు.

బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్:

గులాబీ రేకుల కషాయాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ కరుగుతాయి. దీంతో గుండె ఆరోగ్యం అనేది మెరుగు పడుతుంది. మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )