Hair Growth Tips: ఈ ఆయిల్స్‌తో మహత్యం.. మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!

అందాన్ని పెంచడంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. మీ హెయిర్ స్టైల్స్ బట్టి మీరు మరింత అందంగా కనిపిస్తూ ఉంటారు. ఉన్నది కొద్ది జుట్టు అయినా దాన్ని సరైన విధంగా మెయిన్‌టైన్ చేసుకుంటే అదే చక్కగా ఉంటుంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ విధానంలో.. జుట్టు రాలిపోవడం అనేది జరుగుతుంది. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి, సరైన పోషణ లేకపోవడం, నిద్ర, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఇలా చాలా కారణాలు ఉంటాయి. జుట్టు‌ అందంగా కనిపించేందుకు మార్కెట్లో లభించే ఆయిల్స్, రకరకాల షాంపూలు వినియోగిస్తూ ఉంటారు. ఇవి అందరికీ పడవు. వీటితో మరిన్ని ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అయితే సహజ నూనెలు ట్రై చేస్తే జుట్టు పెరగడాన్ని ఎవరూ ఆపలేరు. మరి జుట్టును పెంచడంలో సహాయ పడే ఆ నూనెలు ఏంటో? ఎలా తయారు చేస్తారో? ఇప్పుడు తెలుసుకుందాం.


కలోంజి ఆయిల్:
కలోంజిని ఆరోగ్య పరంగానే కాకుండా జుట్టును పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆయిల్ తయారు చేయడానికి.. ముందుగా కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ తీసుకుని.. డబుల్ బాయిలింగ్‌పై వేడి చేయాలి. ఇందులో ఒక చెంచా కలోంజి గింజలు వేసి ఓ ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత చల్లారబెట్టి.. ఓ సీసాలోకి తీసుకోవాలి. ఈ ఆయిల్‌లో అనేక పోషకాలు లభిస్తాయి. ఈ ఆయిల్‌ను రెండు రోజులకు ఓ సారి తలకు పట్టించి.. షాంపూ లేదా కుంకుడు కాయలతో స్నానం చేయాలి. ఈ ఆయిల్ జుట్టును పెంచడంలో చక్కగా ఉపయోగ పడుతుంది.

బాదం ఆయిల్:
జుట్టును ఆరోగ్యంగా ఉంచి పెంచడంలో బాదం ఆయిల్ చక్కగా పని చేస్తుంది. వారంలో రెండు సార్లు బాదం ఆయిల్ తలకు పట్టించి, స్నానం చేస్తే.. మంచి రిజల్ట్ ఉంటుంది. బాదం ఆయిల్ రాయడం వల్ల జుట్టు మూలాలు బలంగా మారతాయి. హెయిర్ సాఫ్ట్‌గా, చివర్లు చీలిపోకుండా ఉంటుంది.
కరివేపాకు ఆయిల్:
కరివేపాకుతో జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలుసు. ఇప్పుడు చెప్పబోయే ఈ ఆయిల్ జుట్టును పెంచడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని.. అందులో కరివేపాకులు వేసి.. డబుల్ బాయిలింగ్ పద్దతిలో ఓ ఐదు నిమిషాల పాటు మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టి గాజు సీసాలోకి తీసుకోవాలి.