ఏ జిల్లాల్లోని మహిళలకు, ఆ జిల్లాల్లోనే ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి అనుమతి

ఏపీలో సూపర్ సిక్స్ పథకాల(Super Six Schemes)ను ఒక్కొక్కొటిగా ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేశారు. ఇప్పుడు మరో స్కీమ్ అమలు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Travel)ను అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ (Minister Ram Prasad) ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారని అంతా ఊహించారు. అయితే ఈ స్కీమ్‌పై శాసనమండలి(Legislative Council)లో మంత్రి గుమ్మడి సుధారాణి(Minister Gummadi Sudharani) బాంబ్ పేల్చారు. ఉచిత బస్సు పథకం కోసం ఎప్పుడు అమలు చేస్తారు. మహిళలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని వైసీపీ సభ్యుడు పీవీ సూర్యనారాయణరాజు(YCP member PV Suryanarayana Raju) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి గుమ్మడి సుధారాణి స్పందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కచ్చితంగా ఉంటుందని చెప్పారు. అయితే ఏ జిల్లాల్లోని మహిళలకు, ఆ జిల్లాల్లోనే ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు.


దీంతో ప్రభుత్వంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ(Telangana), కర్ణాటక(Karnataka) మాదిరిగా ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితం చేయడం దారుణమని, కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటు వేస్తే మహిళలను మోసం చేస్తోందని మండిపడుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.