AP with BP: ఏపీలో మహిళలకే బీపీ ఎక్కువ

ఏపీలో ప్రజలు బీపీతో (BP) బాధపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu)వెల్లడించారు


సచివాలయంలో ఈ రోజు ఏపీలో వ్యాధులు, నివారణ, ముందస్తు చర్యలపై ఆయన పవర్​పాయింట్​(Power Point Presentation) ప్రజంటేషన్​ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్డియోవాస్కులర్​డిసీజ్​తో 18.22 శాతం మంది బాధపడుతున్నారని తెలిపారు. అదే విధంగా షుగర్​(Diabetes) వ్యాధితో 12.15 మంది బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. 10.12 శాతం మందవి సీడీపీవో వంటి బారిన పట్టారని తెలిపారు. హృదయ సంబంధిత వ్యాధి గ్రస్తులు కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఎక్కువగా ఉంది.

షుగర్​ వ్యాధి గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్​జిల్లాల్లో ఎక్కువగా ఉంది. ఏపీలో క్యాన్సర్​(Canser) బారిన 6.8శాతం మంది పడ్డారు. వీరిలో ఎక్కువగా గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల ప్రజల ఉన్నారు. ఏపీలో 1978 లక్షల మంది బీపీతో బాధపడుతున్నారని వెల్లడించారు.

అదే విధంగా 11.13 లక్షల మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు వ్యాధులు ఉన్నవారు 20.78 లక్షల మంది అని తెలిపారు. 8.37 లక్షల మంది పురుషులకు బీపీ ఉందన్నారు.. మహిళలో 11.40లక్షల మందికి ఉందన్నారు. రైస్​ఎక్కువగా తినే జిల్లాల్లో షుగర్​ వ్యాధి వస్తుందన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉందన్నారు. బీపీ, షుగర్​రెండూ ఉన్నవారిలో మగవారే ఎక్కువమంది అని తెలిపారు.