మహిళలకు ఎంతో ఇష్టమైన పండగల్లో రాఖీ పండగ ఒకటి. చూస్తుండగానే రక్షబంధన్ వచ్చేసింది. ఆగస్టు 9 శని వారం రోజున భారత దేశం అంతటా ప్రతి ఒక్కరూ రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటారు. పట్నంలో ఉన్న వారు, అత్త వారింటి వద్ద ఉన్న మహిళలు అందరూ తమ పుట్టింటికి చేరుకొని, సోదరులకు ప్రేమగా రాఖీ కట్టి, ఆశీస్సులు అంద చేస్తారు. అయితే ఈ రాఖీ పండగ సందర్భంగా, పలు రాష్ట్రాలు మహిళలకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించాయి. కాగా, అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్షాబంధన్ సందర్భంగా చాలా రాష్ట్రాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించాయి. అందులో కొన్ని రాష్ట్రాలు ఒక్క రోజు మాత్రమే ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కలిపిస్తే, మరికొన్ని రాష్ట్రాలు మాత్రం మూడు రోజులు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించాయి. కాగా, ఏ రాష్ట్రాలు మహిళలకు ఫ్రీ బస్సు ఫెసిలిటీని అందించాయో ఇప్పుడు చూద్దాం.
ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తు, ఆగస్టు 8 ఉదయం ఆరుగంటల నుంచి ఆగస్టు 10 రాత్రి మరకు మహిళలకు యూపీఎస్ ఆర్టీసీ , సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రకటించారు. అలాగే పండగ రద్దీని నివారించడానికి పల్లెల్లో, పట్టణాల్లో అదనపు బస్సులను ప్రవేశ పెట్టడం జరిగింది. ఇలా యూపీ మహిళలకు రాఖీ పండగ సందర్భంగా మూడు రోజుల పాటు ఫ్రీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
హర్యానా ప్రజలకు హర్యానా ప్రభుత్వం తీపి కబురును అందించింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం నయాబ్ సింగ్ సైనీ ఒక్క రోజు మహిళలకు , పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఆగస్టు 8 మధ్యాహ్నం నుంచి ఆగస్టు 9 రాత్రి వరకు 15 ఏళ్లలోపు పిల్లలకు మహిళలకు, ఉచిత బస్సు ప్రయాణం అందించనున్నట్లు అక్కడి గవర్నమెంట్ పేర్కొంది
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ మహిళలకు గుడ్ న్యూస్ అందించారు. రాష్ట్రంలోని మహిళలకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆగస్టు 9, 10 వ తేదీల్లో రాష్ట్రంలోని మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్షా బంధన్ తర్వాత రోజు కూడా ఈ ఆఫర్ అందుబాటులోకి రానున్నదంట. ఈ ఫెసిలిటీ రాజస్థాన్ సరిహద్దుల వరకే వర్థిస్తుందని పేర్కొన్నారు.
అలాగే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఒక్కరోజు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అందించడమే కాకుండా, లాడ్లీ బెహ్నా యోజన లబ్ధి దారులకు రక్షాబంధన్ బోనస్‌తో పాటు అదనం రూ, 250ని ఇచ్చింది. ఇక ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఛండీ గఢ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రజలకు రాఖీ పండగ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాయి.































